ఇండియన్ సూపర్ లీగ్ 2020లో మరో మ్యాచ్ ఫుట్‌బాల్ ప్రియులకు కావాల్సిన మజాని అందించింది. చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఒడిశా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ 2-2 స్కోరుతో డ్రాగా ముగిసింది. 

ఆట ప్రారంభమైన 22వ నిమిషంలో గోల్ చేసిన ఒడిశా ఎఫ్‌సీ ప్లేయర్ డిగో మోరిసియో... తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఎక్స్‌ట్రా 2వ నిమిషంలో గోల్ చేసిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ప్లేయర్ బెంజామిన్ లాంబోట్... స్కోర్లను సమం చేశాడు.

65వ నిమిషంలో నార్త్ ఈస్ట్ ప్లేయర్ క్వెసి అపియా గోల్ చేయగా, 67వ నిమిషంలో ఒడిశా ప్లేయర్ కోల్ అలెగ్జాండర్ గోల్ చేసి మరోసారి స్కోర్లను సమం చేశాడు.

ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా ఒడివా పదో స్థానంలో కొనసాగుతోంది.