ISL 2020: ముంబై సిటీ ఎఫ్‌సీకి సీజన్‌లో తొలి డ్రా... టాప్ టీమ్‌ను కట్టడి చేసిన జంషేడ్‌పూర్...

వరుసగా ఐదో విజయం సొంతం చేసుకోవాలనుకున్న ముంబై సిటీకి షాక్ ఇచ్చిన జంషేడ్‌పూర్...

జంషేడ్‌పూర్ ఎఫ్‌సీ ఖాతాలో మరో డ్రా...

ISL 2020: Mumbai City FC Jamshedpur FC match Draw, Mumbai tops in points table CRA

ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్ 2020లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ ఫుట్‌బాల్ ప్రేక్షకులకు కావాల్సినంత కిక్‌ను అందించింది. వరుసగా నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ముంబై సిటీ విజయాల పరంపరకి బ్రేక్ వేసింది జంషేడ్‌పూర్ ఎఫ్‌సీ. ముంబై సిటీకి విజయం దక్కకుండా నియంత్రించి, మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

జంషేడ్‌పూర్ ఎఫ్‌సీ ప్లేయర్ వాల్‌స్కిస్‌ ఆట ప్రారంభమైన 9వ నిమిషంలోనే గోల్ చేసి, తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఆట 15వ నిమిషంలో ముంబై సిటీ ప్లేయర్ ఓగ్బీచే గోల్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత గోల్ చేసేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సమర్థవంతంగా గోల్స్‌ను ఆపగలిగారు.

6 మ్యాచుల్లో 4 విజయాలు, ఓ డ్రాతో 13 పాయింట్ల సాధించిన ముంబై సిటీ ఎఫ్‌సీ పాయింట్ల పట్టికలో టాప్‌లో తన స్థానం మరింత పదిలం చేసుకుంది. ఆరింట్లో ఒక్కటి మాత్రమే గెలిచి, నాలుగు మ్యాచులను డ్రాలుగా చేసుకున్న జంషేడ్‌పూర్... పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios