ISL 2020: హైదరాబాద్ ఎఫ్‌సీ వరుసగా రెండో ఓటమి... కేరళ బ్లాస్టర్స్ చేతిలో చిత్తు...
కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో ఓడిన హైదరాబాద్ ఎఫ్‌సీ...
హైదరాబాద్ ఎఫ్‌సీకి వరుసగా రెండో ఓటమి...
సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న కేరళ బ్లాస్టర్స్...
ఇండియన్ సూపర్ లీగ్ 2020 సీజన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ రెండో ఓటమి ఎదుర్కొంది. 9వ స్థానంలో ఉన్న కేరళ బ్లాస్టర్స్ చేతిలో 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఎఫ్‌సీ చిత్తుగా ఓడింది. కేరళ బ్లాస్టర్స్‌కి ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఆట ప్రారంభమైన 29వ నిమిషంలో తొలి గోల్ చేసి, తన జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ అబ్దుల్ హక్. ఆ తర్వాత గోల్ చేసేందుకు హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేయర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 88వ నిమిషంలో గోల్ చేసిన జోర్డాన్ ముర్రే, కేరళకు 2-0 తేడాతో అదిరిపోయే ఆధిక్యం అందించాడు.
హైదరాబాద్ ప్లేయర్లు గోల్ చేయడంలో విఫలం కావడంతో 2-0 తేడాతో ఓడింది హైదరాబాద్. ఏడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి, మూడు మ్యాచులు డ్రా చేసుకున్న హైదరాబాద్‌కి ఇది వరుసగా రెండో పరాజయం. ఏడింట్లో మూడు డ్రాలు చేసుకుని, మూడింట్లో ఓడిన కేరళ బ్లాస్టర్స్‌కి తొలి విజయం.