ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎట్టకేలకు రెండో విజయాన్ని అందుకుంది. శనివారం గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో విజయం సాధించిన చెన్నయిన్... రెండు డ్రాలు, రెండు ఓటముల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. 

ఆట ప్రారంభమైన 5వ నిమిషంలో తొలి గోల్ సాధించి చెన్నయిన్‌కి ఆధిక్యాన్ని అందించాడు క్రివెల్లార్డో... అయితే 9వ నిమిషంలో గోల్ చేసిన గోవా ఎఫ్‌సీ ప్లేయర్ ఆర్టిజ్... స్కోరును సమం చేశాడు... ఆ తర్వాత చాలాసేపు ఇరు జట్ల ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా గోల్స్ రాలేదు. ఆట 53వ నిమిషంలో ఆలీ గోల్ చేయడంతో చెన్నయిన్‌కి 1-2 తేడాతో ఆధిక్యం దక్కింది.

మ్యాచ్ పూర్తిసమయం పాటు ఆధిక్యాన్ని కాపాడుకున్న చెన్నయిన్ రెండో విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో చెన్నయిన్ 8వ స్థానంలో, గోవా ఎఫ్‌సీ ఏడో స్థానంలో ఉన్నాయి. గోవా ఏడు మ్యాచుల్లో 2 విజయాలు, 2 డ్రాలు అందుకున్నా గోల్స్ ఎక్కువ చేయడంతో పైస్థానంలో ఉంది.