ISL 2020: బెంగళూరు ఎఫ్‌సీకి రెండో విజయం.. కేరళ బ్లాస్టర్స్‌కి మరో ఓటమి...
4-2 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించిన బెంగళూరు ఎఫ్‌సీ...
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకిన బెంగళూరు...
ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఓడి, రెండు డ్రాలు చేసుకున్న కేరళ బ్లాస్టర్స్...
ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్ 2020 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీ రెండో విజయాన్ని అందుకుంది. కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించిన బెంగళూరు ఎఫ్‌సీ, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది...
కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ రాహుల్ ఆట 17వ నిమిషంలో తొలి గోల్ సాధించి, ఆధిక్యాన్ని అందించాడు. అయితే 29వ నిమిషంలో గోల్ చేసిన బెంగళూరు ఎఫ్‌సీ ప్లేయర్ సిల్వా... స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 51వ నిమిషంలో ఫార్టలు, 53వ నిమిషంలో డెల్‌గాడో వరుసగా గోల్స్ చేయడంతో బెంగళూరుకి ఆధిక్యం దక్కింది.
61వ నిమిషంలో కేరళ ఎఫ్‌సీ ప్లేయర్ ముర్రే గోల్ చేసి... ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. ఛెత్రి 65వ నిమిషంలో గోల్ చేయడంతో మంచి ఆధిక్యంలోకి వెళ్లిన బెంగళూరు ఎఫ్‌సీ... డబుల్ ఆధిక్యంతో మ్యాచ్‌లో విజయం సాధించింది.