ISL 2020: ఏటీకే మోహన్ బగాన్ జోరు... గోవా ఎఫ్‌సీపై అద్భుత విజయం...
పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసిన ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ రాయ్ కృష్ణ..
1-0 తేడాతో గోవా ఎఫ్‌సీపై విజయాన్ని అందుకున్న ఏటీకే...
ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్ 2020లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు మరో విజయాన్ని అందుకుంది. గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది ఏటీకే మోహన్ బగాన్. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేసేందుకు చాలా శ్రమించారు.
అయితే ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రతిఘటించడంతో 85వ నిమిషం దాకా గోల్ రాలేదు. మ్యాచ్ 85వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసిన ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ రాయ్ కృష్ణ, తన జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు.
ఈ విజయంతో ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో గెలిచి, ఓ డ్రా, ఓ మ్యాచ్ ఓడిన ఏటీకే మోహన్ బగాన్... టాప్ 2లో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుని రెండు మ్యాచుల్లో ఓడిన గోవా ఎఫ్‌సీ ఆరో స్థానంలో ఉంది.