ISL 2021: ఏటీకే మోహన్ బగాన్ను నిలువరించిన గోవా ఎఫ్‌సీ... మ్యాచ్ డ్రా...
1-1 స్కోరుతో డ్రాగా ముగిసిన ఏటీకే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ మ్యాచ్...
రెండో స్థానంలో ఏటీకే... మూడో స్థానంలో గోవా ఎఫ్‌సీ...
టాప్ ప్లేస్‌లో ముంబై సిటీ... నాలుగో స్థానంలో హైదరాబాద్ ఎఫ్‌సీ...
ఇండియన్ సూపర్ లీగ్‌లో ఏటీకే మోహన్ బగాన్ జోరుకి గోవా ఎఫ్‌సీ కల్లెం వేసింది. గోవా ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 తేడాతో డ్రాగా ముగిసింది.
ఆట మొదటి సగంలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. ఆట 75వ నిమిషంలో గోల్ చేసిన ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ గ్రాసియా... తన జట్టుకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆట 84వ నిమిషంలో గోల్ చేసిన గోవా ఎఫ్‌సీ ప్లేయర్ పండిత... స్కోరుని సమం చేశాడు.
ఆ తర్వాత ఇరు జట్లకి గోల్ చేసేందుకు అవకాశం దక్కకపవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఏటీకే మోహన్ బగాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, గోవా ఎఫ్‌సీ మూడో స్థానంలో ఉంది.