ISL 2021: చివరి నిమిషంలో గోల్... బెంగాల్, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్‌లో ఉత్కంఠ డ్రా...

ఈస్ట్ బెంగాల్, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్‌ డ్రా...

90వ నిమిషంలో గోల్ చేసిన ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ స్కాట్ నెవిల్లే...

 

ISL 2020-21: Another Super Draw match, East bengal vs kerala blasters match drawn CRA

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో మరో మ్యాచ్ చివరి నిమిషంలో డ్రాగా ముగిసింది. చివరి నిమిషం దాకా ఆధిక్యంలో ఉన్న కేరళ బ్లాస్టర్స్, విజయం ఖాయమని మురిసేపోయేలోపు మ్యాచ్ ఫలితం కాస్తా మారిపోయింది. ఆట ప్రారంభమైన మొదటి 64 నిమిషాలు గోల్ కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

64వ నిమిషంలో గోల్ చేసిన కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ జోర్డాన్ ముర్రే, ఆ జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు. దాన్ని చివరి వరకూ కాపాడుకుంటూ వచ్చిన కేరళ బ్లాస్టర్స్, చివరి నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ స్కాట్ నెవిల్లే గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

పాయింట్ల పట్టికలో ముంబై సిటీ టాప్‌లో ఉండగా కేరళ బ్లాస్టర్స్ 10వ స్థానంలో, ఈస్ట్ బెంగాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios