ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ యూటర్న్.. మొన్న నిరసన, నేడు ఆలాపన.. ఒత్తిడే కారణమా..?

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో ఇరాన్ ఏం చేసినా  సంచలనమే అవుతోంది. మూడు రోజుల క్రితం   జాతీయ గీతం ఆలపించకుండా నిరసన  తెలిపిన  ఆ జట్టు ఫుట్‌బాల్ తాజాగా యూటర్న్ తీసుకుంది.  

Iran National Football Team Takes U turn, sing National Anthem Before Wales Match

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు యూటర్న్ తీసుకుంది.  మూడు రోజుల క్రితం ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా   ఇరాన్  ఫుట్‌బాల్ జట్టు  మ్యాచ్ కు ముందు జాతీయ గీతం పాడలేదు.  తమ దేశంలో  హిజాబ్ వ్యతిరేక నిరసనలకు  సంఘీభావం తెలిపారు.  ఇది పెద్ద దుమారం రేపింది. ఇరాన్  లో ప్రభుత్వాధినేతలకు, ప్రభుత్వానికి అనుకూలంగా నడిచే మీడియాకు ఇది షాకిచ్చింది.  కానీ తాజాగా ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు  గత మ్యాచ్ లో మాదిరిగా చేయలేదు. వేల్స్ తో మ్యాచ్ లో  యథావిధిగా  జాతీయ గీతాలాపన చేసింది. 

వేల్స్ తో  మ్యాచ్ కోసం  ఫీల్డ్ లోకి వచ్చిన  ఇరాన్ జట్టు ఆటగాళ్లంతా  తమ దేశపు జాతీయ గీతం వినిపించగానే  గొంతుకలిపారు. అయితే ఇరాన్ జాతీయ జట్టు తీసుకున్న ఈ యూటర్న్ ఇప్పుడు  సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.   ఫుట్‌బాల్ టీమ్ ను ఇరాన్ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకపోవడంతో ప్రపంచపు దృష్టంతా ఇరాన్ వైపునకు మళ్లింది.  అక్కడ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను పశ్చిమదేశాలు ఖండించాయి.   దీంతో ఇరాన్ ప్రభుత్వం  ఇరుకునపడినట్టైంది. అయితే ఈ మ్యాచ్  తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకువచ్చిందని.. తర్వాత ఆడబోయే మ్యాచ్ లలో ఇలాగే చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయని, అందుకే  వేల్స్ తో మ్యాచ్ లో ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్స్  జాతీయగీతాలాపన చేశారని  నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. 

ప్రభుత్వ ఒత్తిడితో పాటు గురువారం  ఇరాన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  వొరియా  గఫౌరీని  పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ కు మద్దతు తెలపడమే గాక  కేంద్ర విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ ను విమర్శించడం,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడనే ఆరోపణతో  అక్కడి ప్రభుత్వం  గఫౌరీని అరెస్ట్ చేసింది.  

 

వేల్స్ పై ఇరాన్ సూపర్ విక్టరీ.. 

ఇక వేల్స్ తో మ్యాచ్ విషయానికొస్తే.. ఆట చివరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసిన ఇరాన్ వూహించిన విక్టరీ కొట్టింది.   ఆట రెండు అర్థ భాగాలు ముగిసిన తర్వాత నిర్దేశించిన అదనపు సమయంలో ఇరాన్ రెచ్చిపోయింది.   ఆట 98వ నిమిషం, 101వ నిమిషంలో గోల్స్ చేయడం ద్వారా ఇరాన్.. వేల్స్ ను ఓడించింది. దీంతో ఇరాన్ 2-0 తేడాతో వేల్స్ ను ఓడించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios