FIFA: ముగిసిన రౌండ్ ఆఫ్ 16.. నేటినుంచే క్వార్టర్స్.. షెడ్యూల్ ఇదే

FIFA World Cup 2022: మూడు వారాలుగా  ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను అలరిస్తున్న ఫిఫా  ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది.   రౌండ్ ఆఫ్ 16 ముగిసిన  నేపథ్యంలో  నేటి నుంచి  లాస్ట్ 8 దశ (క్వార్టర్స్)  నేటి నుంచి మొదలుకాబోతుంది. 
 

FIFA World Cup: 8 Teams Enters Quarterfinals, Here is the Schedule and Teams Details

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్  కీలక దశకు చేరుకుంది.  మూడు వారాలుగా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో రౌండ్ ఆఫ్ 16 దశ (ప్రిక్వార్టర్స్) ముగిసింది.  16 జట్లు పాల్గొన్న ఈ రౌండ్ లో    ప్రత్యర్థులను ఓడించిన 8 జట్లు  నేటి నుంచి లాస్ట్  8 స్టేజ్ (క్వార్టర్స్) లో తలపడనున్నాయి.  ఈ మేరకు  నేడు  (డిసెంబర్ 9)  క్రొయేషియా - బ్రెజిల్ ల మధ్య తొలి క్వార్టర్స్ జరగనుంది. 

ఖతర్ లోని ఎడ్యుకేషనల్ సిటీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్  తో క్వార్టర్స్ పోరు మొదలుకానుంది.   నాలుగు రోజుల పాటు ఎనిమిది జట్లు  హోరాహోరిగా తలపడే ఈ  (క్వార్టర్స్) దశలో   గెలిచిన నాలుగు జట్లు  సెమీస్ కు వెళ్తాయి. 

షెడ్యూల్ ఇది : 

- డిసెంబర్ 9 :  క్రొయేషియా-బ్రెజిల్ (ఎడ్యుకేషనల్ సొసైటీ) (భారత కాలమానం ప్రకారం  రాత్రి 8.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది) 
- డిసెంబర్ 10 : నెదర్లాండ్స్ - అర్జెంటీనా (లుసాలీ స్టేడియం - 12:30 AM)
- డిసెంబర్ 10 : పోర్చుగల్ - మొరాకో (అల్ తుమామా స్టేడియం - రాత్రి 8.30 గంటలకు) 
డిసెంబర్ 11 :  ఇంగ్లాండ్ - ఫ్రాన్స్ (అల్ బయత్ స్టేడియం - 12:30 AM) 

 

ఆధునిక సాకర్ దిగ్గజాలుగా పేరొందిన   క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లియోనల్ మెస్సీ (అర్జెంటీనా)లకు ఇదే చివరి ప్రపంచకప్ గా భావిస్తున్న తరుణంలో  క్వార్టర్స్ లో ఆ జట్లు  తప్పక గెలవాలని  ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వీరితో పాటు చాలాకాలంగా  ప్రపంచకప్  గెలవాలనే లక్ష్యం మీద ఉన్న బ్రెజిల్, గత ప్రపంచకప్ ఛాంపియన్ ఫ్రాన్స్,  రన్నరప్ క్రొయేషియా, సంచలన ఆటతో తొలిసారి క్వార్టర్స్ కు చేరిన మొరాకోల మధ్య హోరాహోరి పోరు తప్పదు. 

 

క్వార్టర్స్ ముగిసిన తర్వాత  డిసెంబర్ 14, 15న సెమీస్ పోరు జరుగుతుంది. ఇక ఈనెల 18న  ఫైనల్  జరుగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios