Asianet News TeluguAsianet News Telugu

FIFA: భారత ఫుట్‌బాల్‌కు భారీ షాక్.. నిషేధం విధించిన ఫిఫా.. ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు రద్దు

FIFA Suspends AIFF: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భారత ఫుట్‌బాల్‌కు భారీ షాకిచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) పై నిషేధం విధించింది.  దీని కారణంగా భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని కోల్పోయింది. 

FIFA bans All India Football Federation, India Lost U-17  Women's World Cup Hosting Rights
Author
First Published Aug 16, 2022, 10:43 AM IST

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అన్న చందంగా తయారైంది భారత  ఫుట్‌బాల్ పరిస్థితి. ఇప్పటికే దేశంలో ఈ క్రీడకు ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్న భారత్‌కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా).. అఖిల భారతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)కు  భారీ షాకిచ్చింది. ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఎఫ్ఎఫ్ లో బయటి వ్యక్తుల (థర్డ్ పార్టీ) ల ప్రమేయం పెరిగిపోయిందనే  కారణంగా  ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. తమ చట్టాలను ఉల్లంఘించందనే  కారణంతో..  ఫిఫా ఈ వేటు వేసింది. 

ఫిఫా తాజా నిర్ణయం భారత ఫుట్‌బాల్ కు భారీ షాకే.  దీంతో  భారత పురుషుల, మహిళల జట్లు  అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు వీళ్లేదు.  జూనియర్, సీనియర్ స్థాయిలలో కూడా మ్యాచ్ లు రద్దవుతాయి. 

వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కూడా భారత్ కోల్పోయింది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు  భారత్ ఈ టోర్నీని నిర్వహించేందుకు గాను హక్కులు పొందిన విషయం తెలిసిందే. 

 

ఇదిలాఉండగా.. ఈ బ్యాన్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ ఏడాది జరగాల్సి కువైట్ లో జరగాల్సి ఉన్న ఫిఫా వరల్డ్ కప్ తో పాటు వచ్చే ఏడాది ఏఎఫ్‌సీ ఆసియన్ కప్ - 2023 లో  కూడా భారత్ పాల్గొనడం కష్టమే.  

తమ చట్టాలను ఉల్లంఘిస్తూ.. ఏఐఎఫ్ఎఫ్ లో థర్డ్ పార్టీల జోక్యం ఎక్కువైందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిఫా నిర్ణయంతో  ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి.  ఇక ఏఐఎఫ్ఎఫ్ తిరిగి పాలకమండలి ఏర్పాటు చేసుకునేవరకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఫిఫా తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios