పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో... అత్యధిక గోల్స్ చేసిన రెండో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తన కెరీర్‌లో 758 గోల్స్ చేసిన రొనాల్డో, పిలే రికార్డును అధిగమించాడు.

అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ దిగ్గజం జోసెఫ్ బికాన్ రికార్డును సమం చేసేందుకు రొనాల్డో మరో గోల్ చేయాల్సి ఉంటుంది. 

ఒకే క్లబ్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా పీలే రికార్డును కొన్ని వారాల కిందటే అధిగమించాడు లియోనెల్ మెస్సీ. బార్సిలోనా తరుపున 644 గోల్స్ చేసి, పీలే కంటే టాప్‌లో నిలిచాడు. ఇప్పుడు రొనాల్డో కూడా పీలే అత్యధిక గోల్స్ రికార్డును అధిగమించడం విశేషం.