Asianet News TeluguAsianet News Telugu

రొనాల్డో సరికొత్త చరిత్ర... అత్యధిక గోల్స్ చేసిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా...

 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర...

 జోసెఫ్ బికాన్‌ (759) గోల్స్‌ను దాటేసి అత్యధిక ప్రొఫెషనల్ గోల్స్ చేసిన ప్లేయర్‌గా రొనాల్డో...

టాప్ 5లో మెస్సీ...

Cristiano Ronaldo becomes top goal scorer in professional football evenets CRA
Author
India, First Published Jan 21, 2021, 10:56 AM IST

ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో... సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు రొనాల్డో. రొనాల్డో సాధించిన గోల్స్‌తో 450 గోల్స్... గత 9 ఏళ్ల కాలంలోనే రావడం మరో విశేషం.

మాంచెస్టర్ యునైటెడ్ తరుపున 118, తన దేశమైన పోర్చుగల్ తరుపున 102, ప్రస్తుతం ఆడుతున్న జువీ క్లబ్ తరుపున 85, స్పోర్టింగ్ లిస్డన్ తరుపున ఐదు గోల్స్ సాధించాడు సీఆర్7. 2013లో 69 గోల్స్ సాధించిన రొనాల్డో, 2007లో 34, 2008లో 35, 2009లో 30, 2010లో 48, 2011లో 60, 2012లో 62, 2014లో 61, 2015లో 57, 2016లో 55, 2017లో 53 గోల్స్ సాధించాడు. 

35 ఏళ్ల రొనాల్డో... బ్రెజిల్ లెజెండర్ పీలే (757 గోల్స్)ను దాటేసిన కొన్ని రోజులకే జోసెఫ్ బికాన్‌ (759) గోల్స్‌ను దాటేసి అత్యధిక ప్రొఫెషనల్ గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో గోల్ కారణంగా జెవెంటస్ జట్టు, ఇటాలియన్ సూపర్ కప్ టైటిల్‌ను 2-0 తేడాతో నేపోలిని ఓడించి, గెలుచుకుంది. రొమారియా 743 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా, మెస్సీ 719 ప్రొఫెషనల్ గోల్స్‌లో టాప్ 5లో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios