Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా కన్నుమూత

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. 1986లో అర్జెంటీనాకు మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అందించారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు.  
 
Argentinian football legend Diego Maradona dead at 60
Author
Argentina, First Published Nov 25, 2020, 10:25 PM IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. 1986లో అర్జెంటీనాకు మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అందించారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు.  

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. మెరుపు వేగంతో గోల్స్ కొడుతూ.. ఫుట్‌బాల్ ఆటలో ‘ది గోల్డెన్ బాయ్’’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. 1991లో డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురయ్యారు.

1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గాను విధులు నిర్వర్తించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios