Lionel Messi: మరో అరుదైన ఘనత సాధించిన మెస్సీ.. రొనాల్డోతో పోటీ పడి ఏడోసారి బాలెన్ డీ ఓర్ అవార్డు..

Ballon D'or: ఫుట్బాల్ లో అత్యుత్తమ ప్రదర్శన కనిబరిచిన వారికి ఇచ్చే బాలెన్ డీ ఓర్ అవార్డును లియెనల్ మెస్సీ గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. 

Argentina Football Star Lionel Messi wins record seventh title, Alexia Putellas named women's winner

అర్జెంటీనా (Argentina) ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) మరో అరుదైన ఘనత సాధించాడు. ఫుట్బాల్ (FootBall) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేవారికి ఇచ్చే ప్రతిష్టాత్మక బాలెన్ డీ ఓర్ (Ballon D'or) అవార్డును అతడు ఏడోసారి సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు మెస్సీ ఈ  అవార్డును 2009, 2010, 2011, 2012లలో వరుసగా నాలుగు సార్లు గెలుపొందగా ఆ తర్వాత 2015, 2019లో కూడా దక్కించుకున్నాడు. ఇక తాజాగా గెలుచుకున్నది ఏడోసారి కావడం గమనార్హం. పారిస్ (paris) వేదికగా జరిగిన అవార్డు కార్యక్రమంలో సుమారు 30 మందిని దాటుకుని మరీ మెస్సీ.. బాలెన్ డీ ఓర్ ను ఏడోసారి ముద్దాడాడు. 

సుదీర్ఘకాలంగా బార్సిలోనా తరఫున ఆడిన మెస్సీ.. ఈ ఏడాది ఆగస్టులో ఆ జట్టుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్జీ) తో మెస్సీ జట్టు కట్టాడు. క్రేజీ ఒప్పందం తర్వాత పీఎస్జీ తరఫున 11 మ్యాచులాడిన  అతడు.. నాలుగు గోల్స్ కొట్టాడు. 

 

కాగా.. జులైలో జరిగిన కోపా అమెరికా (Copa America) కప్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనాకు టైటిల్ అందివ్వడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ ఫైనల్లో  అర్జెంటీనా.. బ్రెజిల్ (Brazil) ను ఓడించిన కప్ కొట్టి చరిత్ర సృష్టించింది. 28 ఏండ్ల తర్వాత అర్జెంటీనాకు ఒక  మెగా టైటిల్ అందించడంలో మెస్సీ దే కీ రోల్. అంతేగాక అంతకుముందు బార్సీలోనా తరఫున ఆడిన మెస్సీ.. 48 గేమ్స్ లో 38 గోల్స్ చేశాడు. 

తాజాగా తనకు వచ్చిన బాలెన్ డీ ఓర్ అవార్డుపై మెస్సీ స్పందిస్తూ.. ‘రెండేండ్ల క్రితం నేను రిటైర్ అయిపోతానేమో అనిపించింది. కానీ పీఎస్జీకి రాగానే నేను మళ్లీ కెరీర్ మొదలుపెట్టినట్టు అనిపిస్తున్నది. అర్జెంటీనా కోసం నేను సాధించడం కలలా అనిపిస్తున్నది.  కోపా అమెరాకా కప్ లో పాల్గొన్న నా సహచరులకు ఈ అవార్డు అంకితం’ అని అన్నాడు. 34 ఏళ్ల మెస్సీ.. ఏడోసారి ఈ అవార్డు అందుకున్న తరుణంలో అతడి భార్య అంటోనెల్లా రొకాజో తో పాటు.. అతడి ముగ్గురు పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదిలాఉండగా, బాలెన్ డీ ఓర్ అవార్డుల జాబితాలో మెస్సీతో పాటు సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (cristiano Ronaldo) కూడా పోటీ పడ్డాడు.  మెస్సీ  అవార్డు గెలువగా.. రొనాల్డో ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో ఐదు సార్లు రొనాల్డో ఈ అవార్గును గెలిచాడు. 

కాగా మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్బాల్ క్రీడాకారణి అలెక్సియా ఫుటెల్లాస్.. బాలెన్ డీ ఓర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు గెలవడం ఆమెకు ఇదే తొలిసారి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios