FIFA: సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్ తప్పదా..? మెస్సీపై నిషేధం..!

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ తుది దశకు చేరుకున్నది.   మూడు వారాలుగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ సెమీస్ దశకు  చేరింది. తొలి సెమీస్ అర్జెంటీనా-క్రొయేషియా మధ్య జరగాల్సి ఉంది. 

Ahead Of Crucial Semi Finals, Argentina Fans Scared About Messi Ban, Check Why

ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రపంచకప్ కలను  నెరవేర్చుకునే దిశగా ఒక్కో అడుగు వేసుకుంటూ వస్గున్నాడు. లీగ్ దశలో  తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓడిన తర్వాత ఆ జట్టు అద్భుగంగా పుంజుకుంది.  లీగ్ స్టేజ్  లో  తర్వాత రెండు మ్యాచ్ లు గెలిచి  ప్రీక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) కు చేరి అక్కడ కూడా అదిరిపోయే ప్రదర్శనతో  క్వార్టర్స్  దూసుకొచ్చింది.  క్వార్టర్స్ లో  పటిష్ట నెదర్లాండ్స్ ను  4-3 (2-2)  తేడాతో ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. 

సెమీఫైనల్లో ఆ జట్టు గత ప్రపంచకప్ రన్నపర్ క్రొయేషియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందే అర్జెంటీనాకు భారీ షాక్ తాకేట్టు ఉందని సమాచారం.   క్రొయేషియాతో జరుగబోయే సెమీస్ మ్యాచ్  లో అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ఆడేది అనుమానంగానే ఉంది. మెస్సీతో పాటు మరికొంతమంది అర్జెంటీనా ఆటగాళ్ల మీద కూడా  ఫిఫా ఒక్క మ్యాచ్ నిషేధం విధించనున్నట్టు తెలుస్తున్నది. 

క్వార్టర్స్ పోరులో భాగంగా నెదర్లాండ్స్ మ్యాచ్ లో మెస్సీతో పాటు ఇతర అర్జెంటీనా ఆటగాళ్లు వ్యవహరించిన తీరే  ఈ నిషేధానికి కారణం.  క్వార్టర్ ఫైనల్ లో రిఫరీ అంటోనియో  మాథ్యూ ఏకంగా  18 సార్లు  ఎల్లో  కార్డ్  చూపాడు.  ఇందులో అర్జెంటీనా  ఆటగాళ్లకే 16 ఎల్లో కార్డులు రావడం గమనార్హం. ఆటగాళ్లకు మందలింపులో భాగంగా  ఎల్లో కార్డులను  చూపుతారు.  అయితే దీనిపై  మెస్సీ తో పాటు టీమ్ తీవ్ర   ఆగ్రహంగా ఉన్నది.  అకారణంగా రిఫీర తమకు ఎల్లో కార్డులు చూపెట్టాడని  స్వయంగా మెస్సీనే   ఫిఫా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు. 

అయితే ఇది క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించడమేనని  ఫిఫా భావిస్తున్నది. మ్యాచ్ ముగిశాక మెస్సీ మాట్లాడుతూ.. ‘నేను ఈ మ్యాచ్ లో రిఫరీల గురించి మాట్లాడదలుచుకోలేదు. అసలు వాళ్లు ఈ మ్యాచ్ లో మాకు ఇంకా  ఏం షాక్ లు ఇస్తారో అని భయపడ్డాం.  నేను దీని గురించి మాట్లాడను. కానీ కనీసం ఫిఫా అయినా  దీనిపై దృష్టి సారించాలి.  ఇలాంటి రిఫరీలను  నేనైతే కోరుకోను..’ అని  వ్యాఖ్యానించడం గమనార్హం.  దీంతో మెస్సీతో పాటు ఆ జట్టు గోల్ కీపర్ లపై  ఒక మ్యాచ్ నిషేధం తప్పదని   ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే జరిగితే అర్జెంటీనాకు ఎదురుదెబ్బే.

అయితే మెస్సీపై నిషేధం గనక విధిస్తే ఫిఫా  సంగతి చూస్తామని ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులతో పాటు అర్జెంటీనా ఫ్యాన్స్ కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు.  మెస్సీని ముట్టుకుంటే  మంటలు రేపుతామని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 14న అర్జెంటీనా - క్రొయేషియాలు  తొలి సెమీస్ లో తలపడతాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios