Asianet News TeluguAsianet News Telugu

అరేయ్ ఏంట్రా ఇది..! నాయకులు పార్టీలు మారినట్టు క్షణాల్లో జెర్సీ మార్చిన సౌదీ అభిమాని.. వీడియో వైరల్

FIFA World Cup 2022: ‘ప్రజల సేవ’లో తరించేందుకని మన నాయకులు జనాల చెవిలో పువ్వులు పెడుతుంటారు. చాలా ఈజీగా కండువాలు మార్చుతారు.  రాజకీయాల్లో కండువాలు మార్చినంత ఈజీగా  క్రీడాభిమానులు వాళ్ల జట్లను మార్చుకోరు. అది చాలా అరుదు. కానీ... 

After Robert Lewandowski Goal, Saudi Arabia Fan Switches His Jersey to Poland, Video Went Viral
Author
First Published Nov 27, 2022, 11:33 AM IST

ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పార్టీలు మారడం సర్వ సాధారణాంశం. అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు లేదా అధికారంలోకి రాబోయే పార్టీలోకి  మారేందుకు నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరీ ఎన్నికల సమయంలో అయితే ఇలాంటి గోడదూకుడు కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. పొద్దున ఓ పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రం వరకల్లా వేరే పార్టీ కండువా కప్పుకోవడం  చూస్తూనే ఉన్నాం.  ‘ప్రజల సేవ’లో తరించేందుకని మన నాయకులు జనాల చెవిలో పువ్వులు పెడుతుంటారు. రాజకీయాల్లో కండువాలు మార్చినంత ఈజీగా   క్రీడాభిమానులు వాళ్ల జట్లను మార్చుకోరు.  అది చాలా అరుదు.  తమ జట్టు ఓడితే తిట్టుకుంటారేమో గానీ  ఉన్నఫళంగా అభిమానాన్ని మాత్రం  కోల్పోరు. 

కానీ ఇక్కడ ఒక అభిమాని మాత్రం  మ్యాచ్ లో తన దేశపు జట్టు గెలిచేంతవరకూ  అదే జెర్సీ  వేసుకుని  ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ చేయగానే  ఆ జట్టు జెర్సీ  ధరించడం గమనార్హం.   ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

విషయానికొస్తే.. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా  శనివారం  సౌదీ అరేబియా -పోలండ్ మధ్య  మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.  తమ తొలి మ్యాచ్ లో సౌదీ.. పటిష్ట అర్జెంటీనాను ఓడించి  సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఆ జట్టు అభిమానులు  స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఈ మ్యాచ్ లో కూడా సౌదీ.. పోలండ్ కు షాకివ్వడం ఖాయమని అనుకున్నారు.  

మ్యాచ్ లో  పోలండ్ తరఫున ఆట  39వ నిమిషంలో   పియోట్ జెలిన్ స్కీ తొలి గోల్ కొట్టాడు.  పోలండ్ గోల్ కొట్టినా సౌతాఫ్రికా బాగానే పోరాడింది.  ఆట రెండో అర్థభాగంలో సౌదీ ఆటగాళ్లు   గోల్ కొట్టేందుకు  యత్నించారు. కానీ  సెకండ్ హాఫ్ లో  పోలండ్ సారథి  రాబర్ట్ లెవాండోస్కీ రెండో గోల్ కొట్టాడు.  దీంతో   మ్యాచ్ చూస్తున్న సౌదీ  అభిమాని ఒకరు.. అప్పటిదాకా తన జట్టును ప్రోత్సహించి తర్వాత ఉన్నఫళంగా  సౌదీ జెర్సీని విప్పేసి  పోలండ్  జెర్సీని ధరించి   లెవండోస్కీ.. పోలండ్ అని అరవడం మొదలుపెట్టాడు. దీనిని అక్కడే ఉన్న ఓ అభిమాని వీడియో తీసి   ట్విటర్ లో పోస్ట్ చేశాడు.   వీడియో చూసిన  నెటిజనులు.. ఇతడెవరో రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకున్నాట్టున్నాడే అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే  సౌదీకి షాకిచ్చిన  సౌదీ ఆటలు పోలండ్ ముందు సాగలేదు.  ఈ మ్యాచ్ లో పోలండ్ 2-0 తేడాతో సౌదీని చిత్తు చేసింది.   ఆట ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రా టైమ్ లో  సౌదీకి పెనాల్టీ లభించినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.  పోలండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ  రెండుసార్లు అద్భుతంగా అడ్డుకుని  సౌదీ ఆశలపై నీళ్లు చల్లాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios