Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్‌కు మరో షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

FIFA World Cup 2022: రెండ్రోజుల క్రితం ఖతర్ లో ముగిసిన  ఫిఫా ప్రపంచకప్ లో  అర్జెంటీనా చేతిలో ఓడిన బాధలో ఉన్న ఫ్రాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు  కరీమ్ బెంజెమా  రిటైర్మెంట్ ప్రకటించాడు.  

After France Defeat, karim Benzema Announces Retirement  From International Football
Author
First Published Dec 20, 2022, 11:56 AM IST

ఫుట్‌బాల్ ప్రపంచకప్ ముగిసి మూడు రోజులు కూడా కాకముందే  ఫ్రాన్స్‌కు మరో షాక్ తాకింది.   ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్, బాలోన్ డి ఓర్  విజేత  కరీమ్ బెంజెమా  అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  ఆదివారం ఖతర్ లో  ఫ్రాన్స్ ఓటమిని తట్టుకోలేని   బెంజెమా.. తన పుట్టినరోజునాడే రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు.   ఈ విషయాన్ని స్వయంగా అతడే తన ట్విటర్ ఖాతాలో వెల్లడించాడు. ఫిఫా వరల్డ్ కప్ లేకుండా  ఆటకు గుడ్ బై చెబుతున్నందుకు బాధగా ఉందని  పేర్కొన్నాడు. 

సోమవారం  ట్విటర్ వేదికగా   స్పందించిన  బెంజెమా.. ‘ఫ్రాన్స్ ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది.  ఫిట్నెస్, ఇతర కారణాల వల్ల అంతర్జాతీయ కెరీర్  నుంచి తప్పుకోవడానికి ఇదే అనువైన సమయమని నేను  అనుకుంటున్నా.  ఇన్నాళ్లు దేశానికి ప్రాతనిథ్యం వహించడం గొప్ప అనుభవం.. 

నన్ను ఆదరించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా వరల్డ్ కప్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం బాధ కలిగిస్తున్నది.  కానీ ప్రస్తుతం  పరిస్థితులు అనుకూలంగా లేవు.. అందుకే తప్పుకుంటున్నా..’అని  రాసుకొచ్చాడు. 

 

కాగా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో  బెంజెమా ఐదో స్థానంలో ఉన్నాడు.  2007లో ఫ్రాన్స్  తరఫున అరంగేట్రం చేసిన  బెంజెమా.. 97 మ్యాచ్ లలో 37 గోల్స్ కొట్టాడు.   ఫ్రాన్స్ తరఫున 2008,  2012లో యూరో కప్  ఆడిన బెంజెమా  2014 వరల్డ్ కప్ కూడా ఆడాడు.  అయితే 2015లో సెక్స్ స్కాండల్ లో  బెంజెమా ఇరుక్కున్నాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య అతడిపై నాలుగేండ్ల నిషేధం విధించింది. దీంతో  అతడు  ఫ్రాన్స్  2018లో గెలిచిన వరల్డ్ కప్ ఆడలేకపోయాడు.   

నిషేధం ముగిశాక  2021 లో తిరిగొచ్చిన   బెంజెమా..  యూరో కప్  లో దుమ్ములేపాడు. ఈ టోర్నీలో బెంజెమా  నాలుగు గోల్స్ చేశాడు. ఇక నవంబర్ లో ఫ్రాన్స్ జట్టుతో పాటు ఖతర్ కు చేరుకున్న బెంజెమా.. టోర్నీ ఆరంభానికి ముందు  ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. తొడ గాయం కారణంగా  అతడు  టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.  అర్జెంటీనాతో ఫైనల్ లో బెంజెమా ఆడతాడిన అంతా అనుకున్నా అవి  ఊహాగానాలే అయ్యాయి.  ఇక ఆదివారం అర్జెంటీనాతో మ్యాచ్ ముగిసి  ఫైనల్లో  ఫ్రాన్స్ ఓడిన తర్వాత  బెంజెమా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios