ఫైనల్స్‌లో భారత్ విజయం .. 26 వేలమంది ‘వందేమాతరం’ అంటూ నినదిస్తే , మీ రోమాలు నిక్కపొడుచుకోవా
ఇటీవల బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన శాఫ్ ఛాంపియన్‌షిప్ 2023 ఫుట్‌బాల్ టోర్నీలో కువైట్‌ను మట్టికరిపించి భారత్ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 26 వేల మంది అభిమానులు ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘‘మా తుఝే సలామ్’’అని పాడుతూ.. ‘‘వందేమాతరం’’ ఆలపించారు.
నిన్న మొన్నటి వరకు ఐపీఎల్‌తో ఊగిపోయిన ఇండియాలో.. ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఊర్రుతలూగించాయి. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో ‘‘ SAFF Championship 2023 ’’ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్స్ కువైట్‌ను ఓడించి భారత జట్టు విజయం సాధించింది. అయితే భారతీయుల్లో స్వతహాగా దేశభక్తి మెండు.. ఈ విషయం గురించి మరో మాట లేదు. క్రికెట్ మాత్రమే కాదు.. ఏ క్రీడల్లోనైనా భారతీయ ఆటగాళ్లు దేశభక్తిని ప్రదర్శిస్తారు. అలాగే స్టేడియంలో అభిమానులు సైతం ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ వుంటారు.
తాజా ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్స్‌లోనూ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ అభిమానులు వందేమాతరం అంటూ నినదించారు. మొత్తం 26 వేల మంది ‘‘మా తుఝే సలామ్’’ అనే పాటను ఆలపించారు. ఫైనల్స్‌లో పెనాల్టీ షూటౌట్‌లో మ్యాచ్ గెలిచాక ప్రేక్షకులు సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు.. అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లతో స్టేడియాన్ని మారుమోగించారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘‘మా తుఝే సలామ్’’అని పాడుతూ.. ‘‘వందేమాతరం’’ ఆలపించారు.
వీరికి భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా జత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జై హింద్, జై భారత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దాదాపు 26 వేల మంది ఒకేసారి వందేమాతరం అంటూ నినదించడాన్ని మీరు చూస్తే ఖచ్చితంగా గూస్‌బంప్స్ ఖాయం.
ఇక కువైట్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. 1-1తో స్కోరు సమమైన సమయంలో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో భారత్ 5-4 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత్ గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021 సంవత్సరాలలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 9వ సారి SAFF Championship టైటిల్‌ని కొట్టింది.