వెజ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ పిజ్జా డెలివరీ.. కోటి జరిమానా చెల్లించాలంటూ...

తాను వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ పిజ్జా డెలివరీ అయ్యింది. దీంతో.. తనకు తప్పుడు ఆర్డర్ డెలివరీ చేసినందుకు గాను రూ.కోటి చెల్లించాలంటూ ఆమె కోర్టు కి ఎక్కడం గమనార్హం.

Woman asks for 1 crore compensation for being served non-veg pizza!

ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ ఆన్ లైన్ లో  చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అయితే.. ఈ ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో.. కొన్ని కొన్ని పొరపాట్లు జరగడ్ సహజం. ఎప్పుడో ఒకసారి మనం చేసిన ఆర్డర్ కూకుండా వేరే ఫుడ్ వస్తూ ఉంటుంది. అందరం మనుషులమే కాబట్టి... ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. అయితే.. ఓ మహిళ మాత్రం ఏకంగా కోర్టుకి ఎక్కింది. తాను వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ పిజ్జా డెలివరీ అయ్యింది. దీంతో.. తనకు తప్పుడు ఆర్డర్ డెలివరీ చేసినందుకు గాను రూ.కోటి చెల్లించాలంటూ ఆమె కోర్టు కి ఎక్కడం గమనార్హం.

ఈ సంఘటన గజియాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గజియాబాద్ కి చెందిన దీపాలి త్యాగి అనే మహిళ 2019 మార్చి 26వ తేదీన పిజ్జా ఆర్డర్ చేసింది. ఆమె వెజ్ ఆర్డర్ ఛేయగా.. వారు నాన్ వెజ్ డెలివరీ చేశారు. 

దీంతో.. రెస్టారెంట్ కి సదరు మహిళ ఫోన్ చేసింది. దీంతో.. వారు కంపెన్ సేషన్ కింద ఫ్యామిలీ మొత్తానికి పిజ్జా పంపిస్తామని ఆఫర్ చేశారు.  అయితే.. అందుకు ఆమె నిరాకరించారు. తమ మతం ప్రకారం.. జంతువులను చంపి తినడం అనేది పాపం లా భావిస్తారట. అలాంటిది తనకు నాన్ వెజ్ పంపించడాన్ని ఆమె తప్పుగా భావించారు. అందుకే  కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు. దాని ద్వారా  తనకు  తనకు రూ. కోటి  ఇవ్వాలంటూ ఆమె కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ లో ఉంది. మరి ఆమె డిమాండ్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios