Asianet News TeluguAsianet News Telugu

రోజూ వ్యాయాయం చేస్తున్నారా..? మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..

వ్యాయామం చేయడానికి అరగంట ముందు ఒక అరటి పండు లేదా రెండు ఖర్జురాలు తీసు కుంటే మీరు వ్యాయామం అలసట లేకుండా చేయడానికి కావలసిన శక్తి వస్తుంది. 

What to Eat Before, During and After Exercise
Author
Hyderabad, First Published Nov 28, 2020, 1:47 PM IST

బరువు తగ్గాలని అనుకునేవారే వ్యాయామం చేస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే.. అది పూర్తిగా పొరపాటని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేస్తే.. బరువు కంట్రోల్ ఉంటుదన్న మాట నిజమే అయితే.. బరువు సంగతి పక్కన పెడితే ఆరోగ్యంగా ఉంటారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

అయితే.. మరి రోజూ వ్యాయామం చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదన్న విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. మరి.. దానికి నిపుణులు ఎలాంటి సమాధానం చెబుతున్నారో చూద్దాం..

రోజూ గంటసేపు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చెయ్యడం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయాయ ఫలితాలు సరిగా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, వ్యాయామానికి ముందు, తరువాత తీసుకునే ఆహారం సరైనది కాకపోతే వ్యాయామ సత్ఫలితాలు సరిగా అందకపోవచ్చు. 

వ్యాయామం చేయడానికి అరగంట ముందు ఒక అరటి పండు లేదా రెండు ఖర్జురాలు తీసు కుంటే మీరు వ్యాయామం అలసట లేకుండా చేయడానికి కావలసిన శక్తి వస్తుంది. 

వ్యాయామం చేసే సమయంలో మధ్యలో కొద్దిగా నీళ్లు తాగాలి. ఒక వేళ మీ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువగా ఉంటే మధ్యలో ఆహారాన్ని తీసుకోండి. 
వ్యాయామం ముగిసిన తరువాత ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు మిల్క్‌షేక్‌ కానీ, బాదం, ఆక్రోట్‌ గింజలు లేదా తాజా పళ్ళు, పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది. 

అర లీటరు నుండి ముప్పావు లీటర్‌ నీళ్లు తాగితే చెమట ద్వారా పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు. ప్రోటీన్‌ కోసం గుడ్లు, చికెన్‌, చేప; శాకాహారులైతే పప్పు ధాన్యాలు, సెనగలు, రాజ్మా, అల సందలు తీసుకోవచ్చు. దీని వల్ల అలసట తగ్గి, శరీరం త్వరగా కోలు కుంటుంది. వ్యాయామం చేయని రోజుల్లో కూడా ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios