కాఫీ ప్రియులు.. ఎక్కడ ఉన్నా.. అది లేకుండా ఉండలేరు. చాలా మంది ఆ కాఫీలోనూ రకరకాల రుచులను అనుభూతి పొందుతారు. ఫిల్టర్ కాఫీ అని... కూల్ కాఫీ అని.. ఇలా చాలా రుచి చూసి ఉంటారు. అయితే.. ఎప్పుడైనా బట్టర్ కాఫీ రుచి చూశారా..? మీరు విన్నది నిజమే.. బట్టర్ తో కాఫీ తయారు చేస్తున్నారు. కాఫీ ప్రియులంతా కచ్చితంగా రుచి చూడాల్సిన కాఫీ ఇది.. మరి దీని వివరాలేంటో ఓసారి చూద్దామా...

దేశరాజధాని ఢిల్లీ వీధుల్లో ఈ బట్టర్ కాఫీ లభిస్తుంది. జామా మసీద్ కి సమీపంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఈ కాఫీని అందిస్తున్నారు.

తాజాగా.. అమర్ సిరోహి అనే ఫుడ్ బ్లాగర్ ఈ ప్లేస్ ని సందర్శించాడు. ఈ కాఫీకి సంబంధించిన వీడియోని తీసి.. దానిని తన బ్లాగ్ లో షేర్ చేయగా.. మరోసారి ఈ కాఫీ విశిష్టత ప్రజలకు పరిచయమైంది. ఇక్కడ బట్టర్ తో కాఫీ మాత్రమే కాదు.. బట్టర్ టీ కూడా తయారు చేస్తారు.

కాఫీ తయారు చేసే జగ్గులో.. ముందుగా కప్పు పాలు తీసుకుంటాడు. అందులో బట్టర్ చేరుస్తాడు. ఆ తర్వాత అందులో కాఫీ పౌడర్, పంచదార చేరుస్తాడు. తర్వాత దానిని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాడు.  ఆ తర్వాత వేడి వేడిగా కప్పులో సర్వ్ చేస్తారు. దానిపైన కొకొవా పౌడర్ ని చల్లి మరీ అందిస్తాడు. అది మరింత రుచిగా ఉంటుంది.