Asianet News TeluguAsianet News Telugu

ఈ కూరగాయలు.. కేజీ రూ.లక్ష..!

ఓ కూరగాయల వ్యాపారి తాను పండించిన పంటను కేజీ అక్షరాలా లక్ష రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట వివరాలను ఇప్పుడు చూద్దాం

This Vegetable Grown By Farmer In Bihar Sells For Rupees 1 Lakh Per Kg
Author
Hyderabad, First Published Apr 2, 2021, 10:41 AM IST

రోజు రోజుకీ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. ఇది సాధారణంగా అన్ని మధ్యతరగతి ఇండ్లల్లోనూ వినపడే మాటే. రూ.15 కి రావాల్సిన టామాటాలు రూ.30 పలికితే.. బాగా పెరిగిందని మనం భావిస్తాం.  ఉల్లిపాయలు కేజీ రూ.100 కి  చేరినా.. వాటిని కొనాలంటే మనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. అలాంటిది కేజీ కూరగయాలు అక్షరాలా లక్ష రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారా..?

మీరు చదివింది నిజమే. ఓ కూరగాయల వ్యాపారి తాను పండించిన పంటను కేజీ అక్షరాలా లక్ష రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట వివరాలను ఇప్పుడు చూద్దాం..

బిహార్ కి చెందిన అమ్రేష్ సింగ్ అనే వ్యక్తి హాప్ షూట్స్ పంటను పండిస్తున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట కావడం గమనార్హం. కేజీ రూ.లక్షకి అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని  సుప్రియా సాహు అనే ఓ ఐఏఎస్ అధికారిణి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆమె ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

బిహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కరంనిధ్ గ్రామానికి చెందిన  రైతు ఆమ్రేష్ సింగ్(38) అరుదైన పంటను పండిస్తున్నాడు. భారత దేశంలో ఇలాంటి పంట పండించడం చాలా అరుదు. అమ్రేష్ వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మొక్కలను కొనుగోలు చేశాడు.

This Vegetable Grown By Farmer In Bihar Sells For Rupees 1 Lakh Per Kg

ఇప్పటివరకు హాప్స్ భారతీయ మార్కెట్లలో ఎవరూ పండించలేదనే చెప్పాలి. కేవలం ప్రత్యేక ఆర్డర్లు మరియు డెలివరీల మీద మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు.  రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి హాప్స్ సాగును ప్రోత్సహిస్తున్నారు. 

హాప్స్ తప్పనిసరిగా హాప్ ప్లాంట్ హ్యూములస్ లుపులస్ యొక్క పువ్వులు (సీడ్ శంకువులు లేదా స్ట్రోబైల్స్ అని కూడా పిలుస్తారు).ఈ హోప్ మొక్కలోని పువ్వు, కాండం, ఆకు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే కావడం విశేషం. ఇది బీర్ పరిశ్రమకు చాలా ఉపయోగపడుతుంది. క్షయవ్యాధిని నిర్వహించడానికి ఇది సహజమైన మందులాగా పనిచేస్తుంది. ఈ కూరగాయలలో లభించే యాంటీఆక్సిడెంట్లు మీకు అందమైన చర్మాన్ని ఇస్తాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ కూరగాయ బాగా పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios