Asianet News TeluguAsianet News Telugu

చెర్రీలను తినే అలవాటుందా? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..

చెర్రీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

Health Benefits of Eating Cherries
Author
First Published Jun 4, 2023, 1:03 PM IST

చెర్రీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చెర్రీలు తీయగా, పుల్లగా ఉంటాయి. నిజానికి చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో నిద్రకు తోడ్పడే 'మెలటోనిన్' అనే హార్మోన్ కూడా ఉంటుంది. వీటిని తింటే రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. అసలు చెర్రీలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • పొటాషియం ఎక్కువగా ఉండే చెర్రీలను తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
  • నిద్ర లేమిని పోగొట్టే సామర్థ్యం చెర్రీల్లో ఉంటుంది. చెర్రీలను తినడం వల్ల మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది కంటినిండా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మీరు కంటి నిండా నిద్రపోతారు. 
  • బరువు తగ్గాలనుకునే వారుకూడా చెర్రీలను డైట్ లో చేర్చుకోవచ్చు. చెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఇవి ఆకలిని తగ్గించి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. 
  • చెర్రీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చెర్రీలు గుండె పోటు, గుండె జబ్బులు,స్ట్రోక్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • విటమిన్ సి పుష్కలంగా ఉండే చెర్రీలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
  • చెర్రీల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 
  • చెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 
Follow Us:
Download App:
  • android
  • ios