భారతీయ వంటకాలు అదరగొట్టిన అమెరికా చెఫ్.. సోషల్ మీడయాలో వైరల్

ఓ విదేశీయుడు మన వంటకాలకు ఫిదా అయిపోయి.. స్వయంగా తనే తయారు చేశాడు.  అమెరికా చెఫ్ అయిన ఆయన.. ఇండియన్ థాలి తయారు చేసి.. దాని ఫోటోలను ప్రముఖ సోషల్ ప్లాట్ ఫాం అయిన రెడ్డిట్ లో షేర్ చేశాడు.
 

American Chef Impresses Reddit With Delicious Indian Thali Cooked From Scratch

ఎన్ని దేశాలు తిరిగినా.. ఎన్ని వెరైటీలు రుచి చూసినా.. భారతీయ వంటకాలకు మాత్రం ఏదీ సరితూగదు. మన దేశ వంటకాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక రెస్టారెంట్ కి వెళ్లి.. వెజ్ థాలి గానీ.. నాన్ వెజ్ థాలి గానీ ఆర్డర్ చేశామంటూ.. కడుపునిండా భోజనం చేసేయచ్చు. మనం సాధారణంగా ఇంట్లో అయితే.. ఒకటి, రెండు కూరలు చేసుకుంటాం. అదే థాలిలో అయితే... రకరకాల వంటకాలు ఉంచుతారు. అందుకే.. దీనిని ఎక్కువ మంది ఇష్టపడతారు.

అయితే.. ఈ భోజనాన్ని మన దేశీయులు ఎవరు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ.. ఓ విదేశీయుడు మన వంటకాలకు ఫిదా అయిపోయి.. స్వయంగా తనే తయారు చేశాడు.  అమెరికా చెఫ్ అయిన ఆయన.. ఇండియన్ థాలి తయారు చేసి.. దాని ఫోటోలను ప్రముఖ సోషల్ ప్లాట్ ఫాం అయిన రెడ్డిట్ లో షేర్ చేశాడు.

కాగా.. ఆయన షేర్ చేసిన వంటలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ థాలిలో ఆయన కొంచెం వైట్ రైస్, చపాతి, ఆంధ్రా మటన్ కర్రీ, గ్రిల్డ్ బటర్ చికెన్, దాల్ మకనీ, మేక పాలతో రైతా, నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేశాడు. అంతేకాదు.. నోరూరించే గులాబ్ జామూన్ కూడా తయారు చేశాడు. వాటన్నింటినీ థాలి లాగా పెట్టి.. ఆ ఫోటోలను షేర్ చేశాడు. సాధారణంగా మనం వంట చేయగానే.. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. అయితే.. అతను మాత్రం వేరే పూలతో గార్నిష్ చేయడం విశేషం.

తాను రెండు సంవత్సరాల క్రితం ఓ ఇండియన్ చెఫ్ దగ్గర వర్క్ చేశానని అతను చెప్పాడు. భారతీయ వంటకాల మీద మక్కువతో వాటిని నేర్చుకొని తయారు చేసినట్లు చెప్పాడు. తాను హిందీ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నానని... త్వరలోనే భారత్ కి వస్తానంటూ పేర్కొన్నాడు. కాగా.. అతని పోస్ట్ కి ఇండియన్స్ కూడా తెగ రెస్పాండ్ అవుతున్నారు. 

నేను భారత్ లో పుట్టి పెరిగినా.. ఇప్పటివరకు ఈ థాలిలో ఒక్క వంట కూడా వండటం నేర్చుకోలేదు.. మీరు గ్రేట్ సార్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయడం విశేషం. 

 

I’m a westerner who has worked hard learning your amazing food and culture. Today I presented my first thali. Jai Hindi from r/india


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios