శుద్ధ లక్ష్మీః మోక్ష లక్ష్మీ జయలక్ష్మీః సరస్వతీ

  శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా

   వరాంకుశౌ పాశ మభీతిముద్రాం కరేర్వహంతీం కమలాసనస్తాం

  బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీం తాం

                నవరాత్రుల్లో విశేషమైన ఆరవవరోజు మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మను ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి... వంటి ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టలకక్ష్ములను కొలిచిన ఫలితం లభిస్తుంది.

శుద్ధ సత్త్వ స్వరూపిణి. సర్వసంపదల రూపిణి. సంపదలకు అధిష్ఠాత్రి. సుశీల. లోభ మోహ కామ రోష మద అహంకారాదులు లేని నిర్మలమైన క్షమాస్వరూపిణి. సర్వ సస్యాత్మిక. భూతకోికి జీవనోపాయ రూపిణి. వైకుంఠ వాసియైన నారాయణుని భార్య. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యంలో రాజ్యలక్ష్మిగా, భూలోకంలో భూలక్ష్మిగా, మన గృహాలలో గృహలక్ష్మిగా ఉండే తల్లి. ఈ అమ్మ దయ వల్లనే సంపదలు లభిస్తాయి. సత్కర్మలు, శుచి, శుభ్రత, సదాచారం ఉన్నచోట, ఉన్న ఇంట కొలువై ఇహపరాలను అందిస్తుంది మహాలక్ష్మి. పద్మంపై, పద్మహస్తయై, వరదాభయాలను ఇచ్చే స్వర్ణ విగ్రహరూపిణి మహాలక్ష్మి.

దుష్కర్మపరులైన, దురాచార పరాయణులైన వారింట దుఃఖకారిణి అయిన జ్యేష్టాదేవి రూపం కూడా ఈ అమ్మదే. మన కర్మల ఫలాన్ని ఇచ్చే తల్లిగా ఈ రూపం. వెలుగూ, చీకీ కూడా మహాశక్తి రూపాలే.

లకక్ష్ములు అనగా శుభ లక్షణాలు అని అర్థం. లకక్ష్ములు ఉన్నచోట ఉండేది లక్ష్మి. భౌతికంగా మానసికంగా ఎప్పుడూ శుభంగా ఉండడం అనేది దాని నుంచే మనం నేర్చుకోవాలి. శుద్ధలక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి, అనే రూపాలు ఎన్ని ఉన్నప్పికీ ఇవన్నీ అంతర్గతమైన కనిపించని రూపాలే. ధైర్యం కనిపించదు, ఆరోగ్యం కనిపించదు, అది లేనప్పుడు మాత్రం తెలుస్తుంది. ఏవైతే కనిపించకుండా ఉండి కనిపించే శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయో వాినే సంపదలు అంారు. అవే అష్ట లకక్ష్ములుగా కొలవబడుతున్నాయి.

ఈ సంపదలను పొందటమే సంపాదన అవుతుంది. కనిపించేదానికన్నా కనిపించనిది శక్తివంతమైనది. మనస్సులో శుభలక్షణాలు ఉన్నవానికి లక్ష్మీదేవి ఉంటుంది. దేహానికి శుభ్రత, మనస్సుకు శుద్ధమైన ఆలోచనలు ఇవే లక్ష్మీ స్వరూపాలౌతాయి. దాని ద్వారా వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడు. కేవలం ధనము అనేటువిం రూపసంపదకు సంకేతంగా ఉంటుంది. రూప సంపదకన్నా గుణ సంపద విశిష్టమైనది. రూప సంపద తాత్కాలిక అవసరాలను తీరిస్తే, గుణ సంపద వ్యక్తిని ఆనందమయుణ్ణి చేసి శాశ్వతత్వాన్ని చేకూరుస్తుంది. సూర్యుడు ఉదయించినపుడు పద్మం వికసిస్తుంది. భగవంతుని అనుగ్రహం వల్ల కలిగిలే వ్యక్తి వికాసం కూడా ఈ పద్మం లాటిదే. అందుకే అమ్మవారిని పద్మ స్వరూపగా, పద్మాక్షిగ, పద్మస్థితగా, పద్మహస్తగా, పద్మ ప్రియగా, పద్మినిగా, పద్మాలయగా భావించి కొలిచే సంప్రదాయం ఏర్పడింది. ఏ అమ్మ మనదగ్గర ఉంటే అన్ని శక్తులు (లౌకిక పారలౌకిక శక్తులు) మన శక్తులుగా మారతాయో ఆ శక్తులకు ప్రతీకయే మహాలక్ష్మి. ప్రకృతిలో కనిపించే కనిపించని శక్తులన్నికీ సంకేతం. ఈ నవరాత్రుల సందర్భంలో ఆ శక్తులకు ప్రతీకయైన మహాలక్ష్మిని సేవించి అందరం సర్వసంపదలను పొందుదాం, ఆనందిద్దాం.

ఆకుపచ్చరంగు చీరలో దర్శనమిచ్చే అమ్మ చాలా విశేష అలంకారంతో మనలను కరుణిస్తుంది. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించే నైవేద్యం అల్లం గారెలు.

డా.ఎస్.ప్రతిభ