Fact check : ‘బొప్పాయిలు ఫ్రీగా ఇవ్వనందుకు బస్సు ఎక్కించుకోని డ్రైవర్.. నడిరోడ్డుపై రైతు నిరసన’.. నిజం ఇది...
ఆవేదనకు లోనైన రైతు గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో, రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు ఇలా బైఠాయించి, గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు.ఈ వార్త నిజం కాదంటూ.. అచ్చంపేట బస్ డిపో మేనేజర్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రెస్, లోకల్ మీడియా ప్రతినిధులకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఏం రాశారంటే.....
నాగర్ కర్నూలు : Nagar Kurnool జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం... నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక bus వెళుతుంది. అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన papaya పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకున్నాడు.
కాగా, farmer తనకు ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో ఆ బస్సు డ్రైవర్ కోపంతో ఆ రైతు పండించిన బొప్పాయి పండ్లను బస్సులో ఎక్కించుకోలేదు. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో, రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు ఇలా బైఠాయించి, గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు.
అయితే ఈ వార్త నిజం కాదంటూ.. అచ్చంపేట బస్ డిపో మేనేజర్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రెస్, లోకల్ మీడియా ప్రతినిధులకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఏం రాశారంటే.....
‘నాగర్ కర్నూల్ జిల్లా ప్రెస్, లోకల్ మీడియా ప్రతినిధులకు నమస్కారం. rejoinder on a news article ‘బొప్పాయిలు ఫ్రీగా ఇవ్వనందుకు బస్సు ఎక్కించుకోని డ్రైవర్ నడి రోడ్డుపై కూర్చుని రైతు నిరసన’ అనే వార్తా కథనం లోకల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది..
సార్, పై విధంగా ప్రచారం చేసిన వార్తా కథనం పూర్తిగా అవాస్తవం. సదరు వ్యక్తి రోజూ ఆర్టీసీ బస్సులో కొల్హాపూర్ కు బొప్పాయి పండ్లు తీసుకుని వెడుతూ ఉండే విషయం వాస్తవమే. నిన్న కూడా బొప్పాయి పండ్ల పెట్టెలు బస్సులో వేస్తూ.. తనకు రావడానికి కుదరదని, కొల్హాపూర్ లో తన వాళ్లు దించుకుంటారని చెప్పగా.. అందుకు బస్సు సిబ్బంది ఒప్పుకోలేదు.
మనిషి వెంట వస్తేనే లగేజ్ అనుమతించవలసి ఉంటుందని, మనిషి వెంటరాని పక్షంలో కార్గో ద్వారానే రవాణా చేసుకోవాలని కూడా సిబ్బంది సదరు వ్యక్తికి చెప్పడం జరిగింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి ఈ విధమైన కథనాన్ని లోకల్ మీడియాలో ప్రచారం చేయించారు. బొప్పాయి పండ్లు ఇవ్వలేదని డ్రైవర్ తిరస్కరించారనడం పూర్తిగా అవాస్తవం.
దయచేసి ఈ rejoinderను తమ మీడియాలో ప్రచురితం లేదా ప్రసారం చేయవలసిందిగా విజ్ఞప్తి’ అంటూ అచ్చంపేట డిపో మేనేజర్ ఓ నోట్ విడుదల చేశారు.