Fact Check: సైన్యం నుంచి పంజాబీల బహిష్కరణ అంటూ దుష్ప్రచారం.. ఆ వీడియో పచ్చి బూటకం

పంజాబీలను (sikhs) సైన్యం (indian army) నుంచి తరిమికొట్టాలనే చర్చ సాగుతున్న ఓ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబీలందరినీ సైన్యం నుంచి బహిష్కరించాలని అందులో డిమాండ్ చేస్తున్నారు. 

fact check claim of expelling sikhs from the army is fake

పంజాబీలను (sikhs) సైన్యం (indian army) నుంచి తరిమికొట్టాలనే చర్చ సాగుతున్న ఓ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబీలందరినీ సైన్యం నుంచి బహిష్కరించాలని అందులో డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో అమిత్ షా (amit shah) సహా జాతీయ భద్రతా సలహాదారు దోవల్ (ajit doval) కూడా కనిపిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో నిజమెంతో ఒకసారి చూద్దాం...

దర్యాప్తు - ఆసియానెట్‌న్యూస్ తెలుగు దర్యాప్తులో ఈ వైరల్ వీడియో వాదన పూర్తిగా ఫేక్. దీనిపై Googleలో భద్రతా వ్యవహారాలపై మోడి క్యాబినెట్ కమిటీ అనే పదాన్ని సెర్చ్ చేశాం. ఈ క్రమంలో డిసెంబర్ 8వ తేదీకి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రధాని మోడీ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేబినెట్ కమిటీ సభ్యులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ.. మోడీ సహా అందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ స‌మావేశంలో మోడీకి ప‌రిణామాల‌ను పూర్తి స్థాయిలో వివ‌రించారు.

ఈ నేపథ్యంలో గూగుల్‌లో వెతికితే చాలా వీడియోలు దొరికాయి. అందులో ANI నుండి ఒక వీడియో కనిపించింది. ఇది PMO నుండి అధికారికంగా విడుదల చేయబడింది. అయితే ఒరిజనల్ వీడియోలో వాయిస్ ఓవర్ లేదు, అయితే వైరల్ వీడియోలో మాత్రం దానికి వాయిస్ ఓవర్‌ను జోడించారు. 

మరో పరిశోధన - వైరల్ అవుతున్న వీడియో 07 జనవరి 2022 నాటిది. CDS బిపిన్ రావత్ మరణించిన తర్వాత 08 డిసెంబర్ 2021న మోడీ నిర్వహించినప్పటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని వీడియోను మార్ఫింగ్ చేశారు. దీనికి వాయిస్ ఓవర్ జత చేసి దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios