Asianet News TeluguAsianet News Telugu

సిద్ శ్రీరామ్, రానా దగ్గుబాటి... అతిరధ మహారథుల నడుమ జీతెలుగు సంగీత భేరీ!

29 వారాలు, 19 కంటెస్టెంట్స్ , భీకరమైన పోటీ, ఎవరికి వారే సమవుజ్జీలు. అందులోంచి ఫైనల్స్ కి చేరుకున్నారు భరత్ రాజ్, పవన్ కళ్యాణ్, ప్రజ్ఞ నయిని, వెంకట చైతన్య మరియు యశస్వి కొండేపూడి. స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ట్రోఫీ గెలుచుకునేది ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారంతో మీ ముందుకు వస్తుంది మన జీ తెలుగు.

zee telugu sarigamapa grand finale rana and sid sriram as guests ksr
Author
Hyderabad, First Published Mar 18, 2021, 11:50 AM IST

పదానికి పదనిసలు పలికించే గళం ఉండడం ఓ వరం! మరి ఆ పదనిసలకు ఒక వేదిక దొరకడం ఓ వరం! ఆ రెండు పొదిగిన చోటు ఒక అద్భుతం - అదే జీ తెలుగు వారి స రి గ మ ప వేదిక. 29 వారాలు, 19 కంటెస్టెంట్స్ , భీకరమైన పోటీ, ఎవరికి వారే సమవుజ్జీలు. అందులోంచి ఫైనల్స్ కి చేరుకున్నారు భరత్ రాజ్, పవన్ కళ్యాణ్, ప్రజ్ఞ నయిని, వెంకట చైతన్య మరియు యశస్వి కొండేపూడి. స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ట్రోఫీ గెలుచుకునేది ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారంతో మీ ముందుకు వస్తుంది మన జీ తెలుగు.

 ఎప్పుడూ ప్రతిభావంతులని ప్రోత్సహించే జీ తెలుగు ఈసారి కూడా అతిరధ మహారథుల సమక్షంలో విన్నర్ ని తెలుపనున్నారు. సీద్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్, బాబా సెహగల్, సింగర్ కల్పనా మరియు సింగర్ సునీత తదితర వెండి తెర ఇంకా సంగీత ప్రపంచంలోని దిగ్గజాల ముందు మన ఫైనలిస్ట్స్ ఈ ఆదివారం పెర్ఫర్మ్ చేయనున్నారు. ప్రస్తుత తెలుగు సంగీతంలో ధ్రువ తారగా ఎదిగిన సీద్ శ్రీరామ్ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టడానికి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. సింగర్ సునీత, కల్పనా మరియు బాబా సెహగల్ అందరిని వారి పాటలతో మంత్రముగ్ధుల్ని చేయబోతున్నారు. అంతే కాకుండా గీతా మాధురి, రమ్య బెహ్రా, కృష్ణ చైతన్య మరియు జ్యూరీ ప్రేక్షకులని వారి గాత్రంతో అలరించబోతున్నారు.

 సంగీత సరిగమల ఈ సముద్రంలో, వారు పాడే పాటలే పడవగా ప్రయాణం చేయగా, జడ్జెస్ కోటి, ఎస్. పీ. శైలజ, మరియు చంద్రబోస్ దిశా నిర్దేశకులుగా దారి చూపించగా, జ్యూరీ తోడుగా మారగా, అభిమానుల ఆధరణే గమ్యంగా చేసుకొని ఇంతవరకు ప్రయాణించారు. ఇప్పుడు గెలిచేది ఎవరు? ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ టైటిల్ ని సొంతం చేసుకుంది ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం తప్పకుండా జీ తెలుగు లో స రి గ మ ప ప్రత్యక్ష ప్రసారంలో చూడాల్సిందే.

 ఈ ఆదివారం సాయంత్రం మార్చ్ 21 నాడు 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానున్న స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే లైవ్ ను మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీలలో తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios