తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించిన వర్మ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల చేసి బాగా లాభాలు గడించారు. సాయి ధరమ్ నిర్మాతలు కూడా వర్మ పే పర్ వ్యూ కాన్సెప్ట్ ద్వారా కలెక్షన్స్ పై కన్నేశారు.
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ బంధ్ కావడం జరిగింది. దాదాపు తొమ్మిది నెలల తరువాత ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో విడుదల అయ్యింది. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేదనిపిస్తుంది. కాగా ఈ మూవీ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్ సరికొత్త ఆలోచన చేస్తున్నారట. పే పర్ వ్యూ పద్దతిలో జీ ప్లెక్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శనకు పెట్టాలని భావిస్తున్నారట. జనవరి 1 నుండి జీ ప్లెక్స్ లో రూ. 149 చెల్లించి సోలో బ్రతుకే సో బెటర్ మూవీ చూడవచ్చట.
కరోనాకు బయపడి థియేటర్స్ కి రాని వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా ఎంతో కొంత మేర వసూళ్లు రాబట్ట వచ్చని, జీ స్టూడియోస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఉన్నారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించిన వర్మ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల చేసి బాగా లాభాలు గడించారు. సాయి ధరమ్ నిర్మాతలు కూడా వర్మ పే పర్ వ్యూ కాన్సెప్ట్ ద్వారా కలెక్షన్స్ పై కన్నేశారు.
ఇక జీ 5 సబ్స్కైబర్స్ కి ఈ చిత్రం ఫిబ్రవరి నుండి అందుబాటలోకి రానుంది.
సంక్రాంతి వరకు మేజర్ సినిమాల విడుదల లేని కారణంగా సోలో బ్రతుకే సో బెటర్ మంచి కలెక్షన్స్ రాబట్టే సూచనలు కలవు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నభా నటేష్ హీరోయిన్ గా నటించడం జరిగింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి సంగీతం అందించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 30, 2020, 2:29 PM IST