బుధవారం హైదరాబాద్‌లో తారల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ZEE5 `స్టార్-స్టడెడ్ ఈవెంట్ –‘హుక్డ్’`, తెలుగు ప్రేక్షకుల కోసం 11 సిరీస్ లను ఒకే ప్లాట్‌ఫారమ్ మీదకు  తీసుకువచ్చింది.

తారలు తళుక్కున మెరిసిన వేళ. క్రేజీ స్టార్స్ ఒకే వేదికపైకి వచ్చారు. నిహారిక, సుస్మిత,సుశాంత్‌, ప్రవీణ్‌ సత్తారు వంటి సెలబ్రిటీలు ఒకే వేదికపైకి వచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కోసం వీరంతా కలిశారు. అంతేకాదు హరీష్‌ శంకర్‌, శరత్‌ మరార్‌, కోన వెంకట్‌, ఆది సాయికుమార్‌, రాజ్‌ తరుణ్‌ వంటి తారలు కలిసి పనిచేయబోతున్నారు. ఓటీటీ ఆడియెన్స్ కి నాన్‌ స్టాప్‌ వినోదాన్ని పంచబోతున్నారు. 

ఓటీటీ రంగంలో దూసుకుపోతుంది జీ 5. అనేక భారీ చిత్రాలను ఇండియాలోని పలు భాషల్లో అందిస్తున్న ఈ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 11 ఒరిజినల్స్ ని స్టార్ట్ చేస్తుంది. తెలుగులో 11 ఒరిజినల్స్‌తో కూడిన పవర్-ప్యాక్డ్ కంటెంట్ ను అందిస్తుంది. హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో 11 ఒరిజినల్స్‌ సిరీస్ లను జీ 5 గ్రాండ్ గా లాంచ్ చేసింది.

బుధవారం హైదరాబాద్‌లో తారల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీ5 `స్టార్-స్టడెడ్ ఈవెంట్ –‘హుక్డ్’` తెలుగు ప్రేక్షకుల కోసం 11 సిరీస్ లను ఒకే ప్లాట్‌ఫారమ్ మీదకు తీసుకువచ్చింది. ఎంతో క్యూరియాసిటీ గా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈ ఒరిజినల్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, ఉత్తమమైన డబ్బింగ్ కంటెంట్‌ అందిస్తుంది. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. ఇందులో అన్ని బాషల కంటెంట్ తో పాటు మిలియన్ల కొద్దీ వినోదాన్ని అందిస్తుంది. ఇప్పుడు 11 తెలుగు ఒరిజినల్‌ల కంటెంట్ ఆవిష్కరించడం ద్వారా దక్షిణాదిలోని వీక్షకులకు మరింత చేరువ అవుతుంది. 

తెలుగు మార్కెట్‌లోని ZEE5 వీక్షకులు థ్రిల్లర్‌ల నుండి కామెడీ, డ్రామా, రొమాన్స్, ఈ ప్రాంతం యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వంతో లోతుగా పాతుకుపోయిన మరెన్నో సంఘటనలను వీక్షించడానికి విస్తృతమైన స్లేట్‌ను కలిగి ఉంటారు. అదనంగా వీక్షకుల వినియోగ ప్రాధాన్యతలను తీర్చడానికి ప్రత్యేకంగా తెలుగులోకి డబ్ చేయబడిన ZEE5 లైబ్రరీ నుండి అసలైన కంటెంట్, చలనచిత్రాల వరుసతో పాటు బ్లాక్‌బస్టర్ చలన చిత్రాలను చూడవచ్చు. దిల్ రాజు, హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, కోన వెంకట్, నిహారిక మరియు సుస్మిత కొణిదెల సమక్షంలో చాలా మంది వీక్షకులు ఎదురుచూస్తున్న ఈ కంటెంట్ స్లేట్ ఆవిష్కరించడం జరిగిందని నిర్వహకులు తెలిపారు.

శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకృష్ణ, రాజేశ్వరి నాయర్, ఆడుకలం నరేన్, శరణ్య ప్రదీప్, సమ్మెట గాంధీ, ఎస్తర్‌ నటించిన మల్టీస్టారర్ థ్రిల్లర్ అయిన 'రెక్కీ ' వంటి భారీ అంచనాలున్న వెబ్ సిరీస్ తో పాటు .'మా నీళ్ల ట్యాంక్' -ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించబడిన రొమాంటిక్ కామెడీ తో `హార్ట్‌త్రోబ్` సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ కూడా OTT లో రిలీజ్ అవుతుంది.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ATM’ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. సుబ్బరాజు, పృధ్వి, VJ సన్నీ నటించిన హీస్ట్ కామెడీ ఇది. దీనితో పాటు, ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ రాబోయే ‘ఆహా నా పెళ్లంట’లోని ఒక పాట యొక్క లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. ఇది జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఒక వ్యక్తి చేసిన విఫల ప్రయత్నానికి సంబంధించిన సరదా రొమాంటిక్ షో. వీటితోపాటు `పరువు`, `బహిష్కరణ`, `ది బ్లాక్‌ కోట్‌`, `ప్రేమ విమానం`, `హంటింగ్‌ ఆఫ్‌ ది స్టార్స్` వంటి ఒరిజినల్స్ ని రూపొందిస్తుంది. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "ఒక చిన్నా ఫ్యామిలీ స్టోరీ", `నెట్`, `లూజర్` ఫ్రాంచైజీ , ` గాలివానా ` వంటి మంచి కంటెంట్ అందించిన ప్రతిభావంతులైన టీమ్‌లను అభినందించారు దిల్‌రాజు. 

ఇందులో జీ5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ మనీష్ కల్రా మాట్లాడుతూ, `మాకు సౌత్ ఒక ముఖ్యమైన మార్కెట్, మేము ఈ మార్కెట్‌లో వీక్షకుల ఆదరణ పొందడానికి తెలుగు ప్రేక్షకులకు అవసరమైన కంటెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కంటెంట్ కోసం పెరుగుతున్న ఆదరణను ముందే ఊహించాము. తెలుగు పరిశ్రమలోని టాలెంట్‌ ఉన్న వారితో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ 5 నిర్వహకులు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.