నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. 'విక్కీ డోనార్' సినిమాలో వీర్యకణాలను డొనేట్ చేసే పాత్రలో హీరోగా నటించి బాలీవుడ్ కి పరిచయమయ్యాడు ఈ నటుడు.
నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. 'విక్కీ డోనార్' సినిమాలో వీర్యకణాలను డొనేట్ చేసే పాత్రలో హీరోగా నటించి బాలీవుడ్ కి పరిచయమయ్యాడు ఈ నటుడు.
ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఇతడు కరణ్ జోహార్ టాక్ షో.. 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొన్నాడు. ఆయుష్మాన్ తో పాటు సెన్సేషనల్ నటుడు విక్కీ కౌశల్ కూడా ఈ షోకి హాజరయ్యాడు.
తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. షోలో భాగంగా హోస్ట్ కరణ్.. ఆయుష్మాన్ ని రియల్ లైఫ్ లో ఎప్పుడైనా నీ వీర్యకణాలను డొనేట్ చేసావా..? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆయుష్మాన్ అవునని చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది.
ఇదే విషయాన్ని 'విక్కీ డోనార్' చిత్ర దర్శకుడు శూజిత్ సిర్కార్ కి చెప్పానని, అతడు వినగానే కుర్చీలో నుండి కింద పడిపోయాడని గుర్తుచేసుకున్నాడు. ఈ హీరో. మొత్తానికి ఆయుష్మాన్ సినిమాలో స్పెర్మ్ డోనార్ గా నటించడమే కాదు రియల్ లైఫ్ లో కూడా తన వీర్యకణాలను డొనేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.