జగన్ అభిమానులు ఎంతో ఉత్కంటగా ఎదరుచూస్తున్న సినిమా యాత్ర2. ఈమూవీ రిలీజ్  కు కొన్ని ఆటంకాలుఎదురయినా.. అన్ని దాటుకుని విడుదలకు ముస్తాబుతుంది. ఇక ఈసినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి  త‌న‌యుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత  ముఖ్యమంత్రి  సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఉండగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఆధారంగా తెరెక్కించిన సినిమా యాత్ర2.ఈ సినిమాలో జగన్ పాదయాత్రకు సబంధించిన విశేషాలను చూపించబోతున్నారు. గతంలో అనగా.. 2019లో వచ్చిన యాత్ర  సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను చూపించని దర్శఖుడు..ఈసినిమాలో జగన్ పాదయాత్ర విశేషాలను చూపించబోతున్నారు. 

 మహి వి రాఘవ్‌ దర్శకత్వం వ‌హించిన ఈసినిమాలో  వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో హీరో  జీవా  న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కొన్నిఅప్ డేట్ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈమూవీ నుంచి  టీజ‌ర్‌తో పాటు సాంగ్స్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక తాజాగా యాత్రం2  నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ .

 

YouTube video player

అయితే ఈసినిమాలో ఏం చూపించబోతున్నారు..కథ ఎలా సాగబోతుంది అనేది ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత  చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ పెట్ట‌డం, జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పాదయాత్ర చేయడం.. అంచెలంచలుగా ఎదిగి సీఎం అవ్వడం. ఇలా 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఈసినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.