Asianet News TeluguAsianet News Telugu

నేరం రుజువైతే.. నేనే ఉరేసుకుంటా.. యూట్యూబర్ చందూ సాయి సంచలన వ్యాఖ్యలు

తనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే అంటున్నాడు పక్కింటి కుర్రాడు ఫేమ్..యూట్యూబర్ చందూ సాయి. అసలు తాను తప్పు చేయలేదని చేస్తే.. ఏశిక్షకైనా సిద్దం అన్నారు

Youtuber Chandu Sai Sensational comments Viral In Social Media JMS
Author
First Published Jan 12, 2024, 5:04 AM IST


ఈమధ్య సినిమా తారలకంటే య్యూట్యబర్స్ కే  ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటున్నారు. వారిప్రతీ వీడియో లక్షల్లో.. కోట్లల్లో చూస్తుంటారు. దాంతో వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంటుంది. ఫోన్ చేతిలో ఉంటే.. జనాలు ఎక్కువగా చూసేది సోషల్ మీడియా స్టార్స్ నే కదా.. అలా ఫేమస్ అయినవారిలో చంద్రశేఖర్ సాయి కిరణ్ అలియాస్ చందూ సాయి కూడా ఒకరు. షార్ట్ వీడియోస్.. రీల్స్. వెబ్ సీరిస్ లు, సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా వీడియోలు చేసి.. కాస్త మంచి కంటెంట్ ను జనాలకు అందించే వారిలో చందు ముందుంటాడు. అందుకే అతనికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బాగా ఫేమస్అయ్యి.. సినిమాల్లో కూడా ఛాన్స్ లు వస్తున్న టైమ్ లో అతనిపై చాలా పెద్ద నింద పడింది. అది కూడా ఒక అమ్మాయి విషయంలో దారుణమైనఆరోపణలువచ్చాయి అతనిపై. అంతే కాదు ఓ అమ్మాయిని మోసం చేశాడంటూ.. నిందలువేయడంతో పాటు..అతన్ని అరెస్ట్ చేశారు కూడా.. తన కుటుంబాన్నికూడా వదిలి పెట్టకుండా.. వారిపై కూడా కేసులు పెట్టారు. 

ఇక ఒక్క సారిగా జీవితం తలకిందులు అయ్యే సరికి.. తేరుకోలేకపోయాడు చందు.. తొలిసారి తన అరెస్టుపై చందూసాయి స్పందించాడు. చందు సాయికి ఉన్న మంచి ఇమేజ్ కు అతను అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే రకరకాల కామెంట్లువచ్చాయి. కొంత మంది అతన్ని సపోర్ట్ చేస్తూ.. తన గురించి మాకు తెలసు..అతను అలాంటివాడు కాదు.. అంటుంటే..మరికొంత మంది మాత్రంద దొరికిందే సందు అని విమర్షలు గుప్పిస్తున్నారు. చందుసాయిపై.. పై  చీటింగ్, అత్యాచారం కేసు నమోదైందని తెలియడంతో అంతా నివ్వెరపోయారు. పైగా తల్లిదండ్రులు, మరో ఇద్దరిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

నిజంగా చందూసాయి ఇంత మోసం చేశాడా? అతను ఇలాంటివాడేనా..? అన్న ప్రశ్నలు  వెల్లువెత్తాయి. దాంతో వీటన్నింటికి  ఒక్క ఇంటర్వ్యూతో సమాధానంచెప్పాడు చందూసాయి. అరెస్ట్ తరువాత అతను  తొలిసారి స్పందించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వయూలో అతను తన పరిస్థితిని వివరించాడు. తాజాగా ఆ ఇంటర్వ్యూకు సబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.  ఆ ప్రోమోలో చందూసాయి ఎంతో ఎమోషనల్ అయ్యాడు. తనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని.. తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారని బాధపడ్డాడు. తనపై పెట్టిన కేసుల్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని.. అన్నారు. అసలు ఆ పనిచేయాల్సి అసవరం తనకు ఏంటీ అన్నారు.  తనఫ్యామిలీని కూడా కలిపి..నిజానిజాలు తెలుసుకోకుండా.. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ బాధపడ్డారు. 

తన కుటుంబం కోట్లు కట్నం అడిగిందని విమర్శలు చేశారని.. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను నిరూపిస్తే.. ఉరిశిక్షకైనా సిద్ధమని అన్నాడు. అసలు ఉరి వాళ్లు వేయడం కాదు.. తానే ఉరేసుకుని చచ్చిపోతానంటూ  సంచలన వాఖ్యలు చేశారు చందు సాయి.  మరి నిజంగా అతను తప్పు చేశాడా లేదా..? అసలు ఏం జరిగింది..? చూడాలి మరి చందు కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో. 

 

Follow Us:
Download App:
  • android
  • ios