Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ ఛానల్ విలేకరుల నిర్వాకం.. సినీ డైరెక్టర్ నుంచి డబ్బు స్వాహా

కొందరు యూట్యూబ్ ఛానల్ విలేకరులు సినీ దర్శకుడిని బెదిరించి డబ్బు వసూలు చేసిన సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగింది. 

Youtube channel reporters Threatened film director for money
Author
Hyderabad, First Published Aug 12, 2021, 1:15 PM IST

కొందరు యూట్యూబ్ ఛానల్ విలేకరులు సినీ దర్శకుడిని బెదిరించి డబ్బు వసూలు చేసిన సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగింది.  మణికొండ ల్యాంకో హిల్స్ సమీపంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం పేరు చెప్పి ఈ నిర్వాకానికి యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్పడ్డారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా కొందరు యూట్యూబ్ ఛానల్ విలేకరులు లొకేషన్ లోకి ప్రవేశించారు. అనుమతులు లేకుండా ఇక్కడ షూటింగ్ ఎలా జరుపుతారని విలేకరులు దర్శకుడు శ్రీనుని బెదిరించారు. పోలీస్ వారి అనుమతితో పాటు అన్ని పర్మిషన్లని శ్రీను వారికి చూపించారు. 

స్థల యజమాని అనుమతి కూడా తీసుకోవాలని, వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తప్పనిసరి అని.. సలీం తరుపున తాము ఇక్కడకు వచ్చినట్లు హంగామా చేశారు. 4 లక్షలు జరిమానా విధించాలని బెదిరించారు. చివరకు సలీం పేరుతో ఫోన్ కాల్ వచ్చినట్లు హంగామా చేసి దర్శకుడు శ్రీను నుంచి 50 వేలు వసూలు చేసుకుని వెళ్లారు. 

దీనితో దర్శకుడు శ్రీను నార్సింగి పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న కొన్ని ముఠా గ్యాంగ్ ల నుంచి ప్రజలతో పాటు ఇలా సినిమావాళ్ళకు కూడా కష్టాలు తప్పడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios