యంగ్ డైరక్టర్ తో హీరోయిన్ సహజీవనం, వేషం మాత్రం ఇవ్వటం లేదు

తాజా సమాచారం మేరకు యువ దర్శకుడు ఇప్పుడిప్పుడే తెలుగు లో  నిల దొక్కుకుంటున్న హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నారని సమాచారం. ముంబై నుంచి వచ్చిన ఆ ముద్దుగుమ్మ కు  ఇదేమి పెద్ద విషయంగా అనిపించడం లేదట.

Young tollywood Director s Live-In With Heroine jsp

ఇన్నాళ్లూ బాలీవుడ్ కి హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన లివింగ్ రిలేషన్షిప్ కల్చర్ మెల్లిమెల్లిగా టాలీవుడ్లోనూ ప్రవేశిస్తోంది. గతంలో వింతగా చెప్పుకునే ఈ విషయాలు ఇప్పుడు  చాలా కామన్ థింగ్స్ గా మారిపోయాయి. సినీ జనం వీటిని బహిరంగంగా చర్చించడానికి కూడా  వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలోనూ వరస డిస్కషన్స్ చేస్తున్నారు. అంతెందుకు నయనతార, దర్సకుడు విష్నేష్ సహజీవనం కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నుంచి వినబడుతున్న తాజా సమాచారం మేరకు యువ దర్శకుడు ఇప్పుడిప్పుడే తెలుగు లో  నిల దొక్కుకుంటున్న హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నారని సమాచారం. ముంబై నుంచి వచ్చిన ఆ ముద్దుగుమ్మ కు  ఇదేమి పెద్ద విషయంగా అనిపించడం లేదట.

కల్చర్ లో వస్తున్న మార్పుల్ని జీవితంలో ఎడాప్ట్ చేసుకోవటంలో  సిగ్గు పడాల్సిన అవసరం లేదంటుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఆ హీరోయిన్ తన సహజీవన ప్రియుడు డైరెక్ట్ చేసే  సినిమాలో వేషం అడగడం దగ్గర వచ్చిందని తెలుస్తోంది. అతను త్వరలో డైరెక్ట్ చేసే సినిమా లో ముగ్గురు హీరోయిన్ కి అవకాశం ఉంది. అయినా ఆ ముగ్గురిలో ఒకరిగా కూడా తన ఆమె కి అవకాశం ఇవ్వలేదు.దాంతో ఆ డైరెక్టర్ తన కెరీర్ కి నిచ్చెనలా ఉపయోగపడతాడు అనుకున్న ఆమె చాలా నిరాశ పడింది.అయితే పర్సనల్ లైఫ్ వేరు ఫ్రొఫిషినల్ లైఫ్ వేరు అని అందరికీ చెప్పడానికే ఆ డైరెక్టర్ అలా బిహేవ్ చేస్తున్నాడని సమాచారం. 

కాకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న సదరు హీరోయిన్ ఊరుకుంటుందా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి రచ్చ రచ్చ చేస్తుందిట.ఆమె పైన సానుభూతితో మరేదో కారణంతోనో డైరెక్టర్స్ మాత్రం ఆమెకి వరస ఆఫర్స్ ఇస్తున్నారు అని వినికిడి ఈ విధంగా అయినా ఆమె పూర్తిగా బిజీ అవుతోంది. మరో విషయం ఏమిటి అంటే ఆ యంగ్ డైరక్టర్ సినిమాల్లో నటించటానికి చాలా మంది హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారు. హీరోయిన్స్ కు మంచి క్యారక్టర్స్ రాయటంలో కుర్రాడు టాలెంట్ కావటం  ప్లస్ అంటున్నారు. ఏమదైనా సహజీవనం చేస్తున్న పాపని కూడా పట్టించుకుంటే ఈ విషయాలు బయిటకు రావు కదా. ఏమంటారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios