Asianet News TeluguAsianet News Telugu

నా మిత్రుడు గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. సీటీమార్ పై ప్రభాస్ కామెంట్స్

మాస్ హీరో గోపీచంద్ చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటీమార్ చిత్రం వినాయక చవితి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Young rebel star Prabhas comments on Gopichand Seetimaarr movie
Author
Hyderabad, First Published Sep 12, 2021, 11:25 AM IST

మాస్ హీరో గోపీచంద్ చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటీమార్ చిత్రం వినాయక చవితి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. 

సీటీమార్ చిత్రంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. దీనితో ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో సీటీమార్ చిత్రం గురించి ఓ పోస్ట్ పెట్టాడు. 'నా స్నేహితుడు గోపీచంద్ 'సీటీమార్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులని పట్టించుకోకుండా, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన తొలి పెద్ద చిత్రం ఇది. అందుకు చిత్ర యూనిట్ ని అభినందించాలి' అని ప్రభాస్ కామెంట్స్ చేశాడు. 

ప్రభాస్ కామెంట్స్ కి గోపీచంద్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. థాంక్యూ మై ఫ్రెండ్ ప్రభాస్.. నీ ప్రేమ, మాటలకు. సీటీమార్ చిత్రంపై నీ స్పందన విని చాలా సంతోషానికి గురయ్యాం' అని గోపీచంద్ ట్వీట్ చేశాడు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో థియేటర్స్ సమస్య ఉన్నప్పటికీ సీటీమార్ చిత్రం మంచి వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ తగ్గలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. 

కబడ్డీ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ అంశాలతో సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

Follow Us:
Download App:
  • android
  • ios