Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో భోజనం ఖర్చు ప్రభాస్‌దే..? రాములోరి భోజనానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే..?

అయోధ్యలో రాజుగారి భోజనం .. భోజనం ఖర్చంతా భరించడానికి యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ముందుకు వచ్చాడు. ప్రతిష్ట రోజు భక్తుల అన్న ప్రసాదాలకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే..? 
 

Young Rebel Star Prabhas Announces Donation of 50 Crores for Ram Pratishtha Day Meals in Ayodhya JmS
Author
First Published Jan 18, 2024, 4:17 PM IST

మిత్రుడు శత్రువు అన్న తేడా లేకుండా.. ఇంటికి వచ్చిన వ్యక్తికి అతిథ్యం ఇచ్చి.. కడుపునిండా అన్నం పెట్టి పంపించడంలో నిజం రాజుల వారసుడు అనిపించుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు.. ఆయన వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించే మాట్లాడుకోవాలి. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. షూటింగ్ ఉంటే.. తాను ఏం తింటాడో.. తన సెట్ లో ఉన్నవారందరికి అదే భోజనం ఏర్పాటు చేస్తాడు ప్రభాస్. 

ఇక ప్రభాస్ ఇంటి భోజనం తిన్నహీరోయిన్లు. ఇతర భాషల నటులు ఎన్నో సార్లు ఆయన గురించి పొగుడుతూ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాజుగారి భోజనం గోప్పతనం.. ఉదారగుణం దేశమంత తెలిసే సందర్భం వచ్చింది.  రాములోరి ఉత్సవానికి  ప్రభాస్ భోజనం ఏర్పాట్లు చేశారు.  కోట్లాది మంది ప్రజలకు ప్రభాస్ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా భక్తులు  వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల  నెరవేరబోతుంది. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చెక చెకా చేస్తున్నారు. 

ఈక్రమంలో  అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ  విదేశాల నుంచి వేల సంఖ్యలో సెలబ్రిటీలు హాజరవుతుండగా.. లక్షల్లో సామాన్య ప్రజలు హాజరుకాబోతున్నారు. నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ఇప్పటికే అయోధ్యలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు.  అయితే అయోధ్యకు వచ్చే భక్తుల కోసం భోజనం ఖర్చు ప్రభాస్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.  అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జనవరి 22న ప్రారంభోత్సం జరిగే ఆ ఒక్క రోజు అన్నదానం కోసం  ప్రభాస్ విరాళం ప్రకటించారట.

Young Rebel Star Prabhas Announces Donation of 50 Crores for Ram Pratishtha Day Meals in Ayodhya JmS

అయితే అయోధ్య ప్రతిష్ట రోజు మాత్రమే భోజనాల ఖర్చు.. దాదాపు 50 కోట్లకు పైనే అవుతుందని. ఆఖర్చును భరించడానికి ప్రభాస్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. షూటింగ్స్ జరిగే టైమ్ లో కూడా ప్రభాస్ ఒక్కడే భోజనం చేసే అలవాటు లేదు. ఆయన భోజనం చేస్తున్నాడు అంటే.. ఆ రోజు 2 నుంచి 3 లక్షల దాకా ఖర్చ గ్యారంటీ.. షూటింగ్ లోకేషన్ లో ఉన్న ఫ్రెండ్స్, సిబ్బందికి అందరికీ రెబల్ స్టార్ ఆర్డర్ ఇస్తాడు. ప్రభాస్ భోజనంలో ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో.. మిగతా సిబ్బంది ప్లేట్స్ లోనూ అంతే ఉండాల్సిందే. రెబల్ స్టార్ కృష్ణం రాజు చనిపోయిన తర్వాత.. పెద కర్మ రోజు కూడా లక్షల మందికి  భోజనాలు పెట్టించాడు ప్రభాస్.దాదాపు కోటిరూపాయలకు పైగా ఖర్చు చేసిశాడు.  ఇప్పుడు అయోధ్యలోనూ 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. అన్నదానం చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ప్రభాస్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios