కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా బిగిల్. మెర్సల్ అనంతరం అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. 

అలాగే మధ్య వయస్కుడిగా మరో పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా ఇటీవల హీరోయిన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్నాను ఒక హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేసేందుకు దర్శకుడు ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. 

ఇక రీసెంట్ గా మరో హీరోయిన్ పాత్ర కోసం రాశి ఖన్నాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. ఇక ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.