హీరోగానే కాకుండా తన సినిమాలకు సంబంధించిన కథల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు ఓ కుర్ర హీరో. రచయితగా కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. గతేడాది అతడు నటించిన సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.

అయితే చాలా కాలంగా ఇతడు సీనియర్ నటితో డేటింగ్ చేస్తున్నాడు. కెరీర్ ఆరభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత మరో సినిమా చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో వీరిది పెద్ద కుటుంబం. సొంతంగా స్టూడియో, బ్యానర్ లు కూడా ఉన్నాయి. ఆ స్టూడియో వ్యవహారాలన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటుంది.

ఇప్పుడు ఆమె తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఇదివరకే ఆమెకి వివాహం జరిగినా.. భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు కూడా ఈ పెళ్లి విషయంలో సంతోషంగానే ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారు. కానీ హీరో కుటుంబసభ్యులు ఈ పెళ్లికి అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. ఆ కారణంగానే అనౌన్స్మెంట్ కూడా ఆలస్యమవుతుందట. అంతా కుదిరితే.. డెస్టినేషన్ వెడ్డింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు.