తండ్రైన యువ హీరో సుహాస్..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి.
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు.
సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా డెబ్యూ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో కూడా సుహాస్ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇలా ఈ యువ హీరో చాప కింద నీరులా వరుస చిత్రాలతో రాణిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ యువ హీరో సోషల్ మీడియాలో ప్రొడక్షన్ నంబర్ 1 అంటూ పోస్ట్ చేశాడు. ఏంటి సుహాస్ అప్పుడే నిర్మాత కూడా అయిపోయాడా అని ఆశ్చర్యపోవద్దు. ప్రొడక్షన్ నంబర్ 1 అంటే నిర్మాణ సంస్థ కాదు.. ఈ యువ హీరో రియల్ లైఫ్ లో తండ్రి అయ్యాడు. సుహాస్ భార్య లలిత నేడు సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
నేడు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే సుహాస్ కి కొడుకు పుట్టడంతో మరచిపోలేని అనుభూతిగా మారిపోయింది. ఆసుపత్రి బెడ్ పై తన భార్య ఉండగా అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకుని ఈ యువ హీరో మురిసిపోతున్నాడు.
సుహాస్, లలిత ఇద్దరిదీ ప్రేమ వివాహం. 2017లో ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి అంగీకారం తెలపలేదు. ప్రస్తుతం సుహాస్ హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. అదే సమయంలో హిట్ 2లో విలన్ గా కూడా నటించి షాకిచ్చాడు.