Asianet News TeluguAsianet News Telugu

ఒసేయ్.. నీ అంతు చూస్తా... రెచ్చిపోయిన రాజ్ తరుణ్, అవేశంలో నోరు జారిన యంగ్ హీరో...?

యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తున్నాడా..? చాలా రోజులు అవుతుంది ఈ హీరో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి. ఒకప్పుడు.. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. చేతులారా లైఫ్ ను పాడు  చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా అతను ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ అందులో ఏముంది. 
 

Young Hero Raj Tarun Sensational Comments Video viral
Author
First Published Oct 30, 2022, 1:54 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తున్నాడా..? చాలా రోజులు అవుతుంది ఈ హీరో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి. ఒకప్పుడు.. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. చేతులారా లైఫ్ ను పాడు  చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా అతను ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ అందులో ఏముంది. 

సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.  చాలా చిన్న వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ బిగినింగ్ లోనే సక్సెస్ లు చూసిన రాజ్ తరుణ్.. తన నిర్ణయాల వల్ల  అంతే ఫాస్ట్ గా కింద పడిపోయాడు. కుమారీ 21 ఎఫ్ సినిమా తరువాత అతనికి చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు కాని.. సాలిడ్ హిట్ మాత్రం పడలేదు ఇప్పటి వరకూ. అయినా సరే తన ప్రయత్నాలు మాత్రం తాను చేసుకుంటూ వెళ్తున్నాడు రాజ్.

ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ తన ఇన్ స్టాలో ఓ వీడియోపోస్ట్ చేశాడు. అది అందరికి ఆశ్చర్యపరుస్తోంది. అందులోఅతను మాట్టాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో  రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. హలో అండి అందరికీ నమస్కారం. నేను సడెన్ గా  ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఒకటి ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని ..నేను కలలో కూడా ఊహించలేదు.  అంటూ తన కథను స్టార్ట్ చేశాడు. 

నాకు చిన్నప్పటినుంచి ఓ భయం ఉంటుంది . అమ్మాయిలతో మాట్లాడాలన్నా వాళ్లతో క్లోజ్ గా మూవ్వాలన్న చాలా భయం. దీంతో నాకు అర్థం అయిపోయింది మన జీవితంలో ఈ లవ్వుల్లాంటివి నడవవు.. అని అందుకే సిగ్గు విడిచి  నాకు పెళ్లి చేయండి రా బాబోయ్ అని మా పేరెంట్స్ ను అడిగాను.. దాంతో అందరూ కంగారు పడ్డారు. మొదట అంతా అదోలా చూసినా.. ఆతరువాత మాత్రం నా  బాధను.. నా కక్కుర్తి అర్థం చేసుకొని ఒక సంబంధం చూశారు. ఇక నేను కలలు కన్న జీవితం వస్తంది హమ్మయ్య పెళ్లి సెట్ అయ్యింది..  లైఫ్ హిట్ అన్న రేంజ్ లో ఫిక్స్ అయిపోయాను. 

ఇక మండపం  మాట్లాడటం,.. పెళ్ళి పనులు అన్నీ చకచకా స్టార్ట్ అయ్యాయి. రాబందులు లాంటి బందువులు వచ్చారు. పెళ్ళి టైమ్ రానే వచ్చింది. ఇక నన్న పండగ గంగిరెద్దునుతయారు చేసినట్టు చేసుకుని మండపానికి తీసుకెళ్లారు. మేము వెళ్లి కూర్చున్న టైమ్ కు పెళ్లికూతురు చెల్లి ఓ లెటర్ తెచ్చింది. నేను చెప్పలేను ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా..మొగుడు పోయి ఏడుస్తుంటే డాష్ డాష్ డాష్ అనే సామెత ఉంది. అలా అయిపోయింది అక్కడ పరిస్థితి.  చచ్చిన పాముని ఇంకా ఎంతసేపు చంపుతారు ఎంత అనుకున్నా పోయిన అమ్మాయి మాత్రం తిరిగి రాదు కదా..? 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Tarun (@rajtarunn)

అంతే కాదు అసలు ఇక్కడున్నవాళ్ళను కాదు..వెళ్లిపోయిన దాన్ని అనాలి అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు రాజ్ తరుణ్  వాళ్ళని కాదు అనాల్సింది అంటూ మొదలెట్టి..  ఒసేయ్ నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా.. రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయాడు. ఇదంతా ఏంటీ...? రాజ్ తరుణ్ కు నిజంగా ఇదంతా ఎక్స్ పీరియియన్స్ అయ్యిందా అంటూ ఆశ్చర్యపోతున్న అభిమానులకు... సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని చివరల్లో తెలుస్తోంది. 

సినిమా ప్రమోషన్ కోసం రెచ్చిపోయాడు రాజ్ తరుణ్. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. అంతే కాదు ఇలా వెరైటీగా ప్రమోషన్ చేసినందకు విశ్వక్ సేన్  చాలా ఇబ్బందులు పడ్డాడు. అఫ్ కోర్స్ ..ఆ కాంట్రవర్సీనే అతని సినిమాకు పబ్లిసిటీగా మారింది అనుకోండి.  మరి రాజ్ తరుణ్ ఏ సినిమా కోసం ఇలా చేశాడో..? అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios