Asianet News TeluguAsianet News Telugu

రామ్ కోసం మరో యంగ్ హీరోను విలన్ ని చేసిన బోయపాటి శ్రీను

ఈ మధ్య హీరోలను విలన్లుగా మార్చడమే పనిగా పెట్టుకున్నాడు బోయపాటి శ్రీను. ఇక ప్రస్తుతం మరో యంగ్ హీరోను రామ్ కోసం విలన్ ను చేయబోతున్నాడట. 

Young Hero Prince Villain In Ram Movie Directed By Boyapati
Author
First Published Feb 2, 2023, 12:08 PM IST

బోయపాటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకరం లేదు. ఊరమాస్ కథతో.. యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో అదిరిపోతుంటాయి. ఇక బోయపాటి సినిమా అంటే చాలు ఎవరో ఒక హీరో... విలన్ గా మారిపోతాడు అని ఫిక్స్ అవుతారు ఫ్యాన్స్. బోయపాటి సినిమాల్లో స్పెషలే అది. ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతిబాబు, శ్రీకాంత్ లను విలన్లుగా మార్చింది బోయపాటే. ఇకయంగ్ హీరో ఆది పినిశెట్టిని కూడా విలన్ గా చూపించాడు బోయపాటి. ఇప్పుడు మరో యంగ్ హీరోను విలన్ గా మార్చబోతున్నాడట. 

టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను... ఉస్తాద్ హీరో రామ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్ కోసం తారాడుతున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో.. ఈసారి బోయపాటినే నమ్ముకున్నాడు రామ్.  రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. సూపర్ ఫాస్ట్ గా ముంగించేలా ప్లాన్ చేసుకుంటున్నారట టీమ్. ఇక ప్రస్తుతం ఈసినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ సినిమాలో రామ్ ని ఢీ కొట్టేందుకు ఒక యంగ్ హీరోని విలన్ గా మార్చేస్తున్నాడట బోయపాటి.లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ హీరో జగపతిబాబుని విలన్ చూపించి ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ పరిచయం చేశాడు. తాజాగా అఖండ మూవీలో కూడా మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని పవర్ ఫుల్ విలన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ఇప్పుడు రామ్ సినిమా కోసం టాలీవుడ్ లవర్ బాయ్ ని విలన్ చేయబోతున్నాడు. నీకు నాకు డాష్ డాష్ మూవీతో పరిచమై బస్ట్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ సెసిల్, రామ్ కి విలన్ గా బోయపాటి సినిమాలో కనిపించబోతున్నాడట. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prince Cecil (@princececil3)

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఉన్న ప్రిన్స్.. 8 ప్యాక్ తో  డిఫరెంట్ గా తయారయ్యాడు ప్రిన్స్.  ఇప్పటికే రామ్ తో నేను శైలజా సినిమాలో నటించాడు ప్రిన్స్. ఇక ఇప్పుడు రామ్ కు ఏకంగా విలన్ గానే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటివరకూ రాలేదు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో రామ్ తో కలిసి చిందులేసినట్లు సమాచారం. 

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను  సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.  ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ.. ఈసినిమాతో అయినా రామ్ మరో సాలిడ్ మాస్ హిట్ కొడతాడా..? లేక మళ్ళీ జానర్ మార్చుకుంటాడా అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios