ఇటీవల సవారి సినిమాతో డీసెంట్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో నందు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించి ఓ రేంజ్‌లో హడావిడి జరిగింది. ముఖ్యంగా బిగ్‌ అనౌన్స్‌మెంట్ అంటూ తన సోషల్ మీడియాలో నందు చేసిన పోస్ట్‌ ఓ రేంజ్‌లో చర్చనీయాంశమైంది. అయితే ఆ చర్చలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ తన కొత్త సినిమా పేరును ఎనౌన్స్ చేశాడు నందు.

తాజాగా ఆ సినిమా ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలో నందు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్‌. ఈ రోజు హీరో నందు విజయ్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు పోతురాజు అని అతడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిమానిగా కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్‌.

రష్మీ గౌతమ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కు రాజ్‌ విరాట్ దర్శకుడు. ప్రశాంత్‌ విహారి సంగీతమందిస్తుండగా ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.