Asianet News TeluguAsianet News Telugu

యానిమల్ మూవీని దుమ్మెత్తి పోస్తూ యువ డాక్టర్ రివ్యూ.. సందీప్ రెడ్డిని మానసిక వైద్యుడికి చూపించాలి, వైరల్

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మితిమీరిన వయలెన్స్, అసభ్యకరమైన చేష్టలు, రొమాన్స్ పట్ల కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓ యువ డాక్టర్ యానిమల్ చిత్రంపై సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. 

young doctors review on Sandeep reddy and ranbir Animal movie goes viral dtr
Author
First Published Dec 6, 2023, 6:06 PM IST

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం సందీప్ స్టైల్ లోనే ఉంటూ ఆకట్టుకుంటోంది. అయితే కొంతవరకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద యానిమల్ చిత్రం బీభత్సం సృష్టిస్తోంది. 

వితిమీరిన వయలెన్స్, రొమాన్స్ ఉన్నప్పటికీ ఈ చిత్ర విజయానికి ఏమీ అడ్డు కావడం లేదు. యువతలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. చాలా వైవిధ్యంగా ఉండే తండ్రి సెంటిమెంట్, రణబీర్ నటన.. రష్మికతో కెమిస్ట్రీ.. ఫస్ట్ హాఫ్ లో పవర్ ఫుల్ గా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. 

అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మితిమీరిన వయలెన్స్, అసభ్యకరమైన చేష్టలు, రొమాన్స్ పట్ల కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓ యువ డాక్టర్ యానిమల్ చిత్రంపై సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. 

డాక్టర్ శ్రీ రఘురామ్ యానిమల్ చిత్రానికి రివ్యూ ఇస్తూ తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జనాలు ఏదో చెబుతున్నారు కదా అని యానిమల్ చిత్రానికి వెళ్ళాను. ఆ మూవీ చూడడం నాదే తప్పు. కానీ ఇలాంటి చిత్రం సక్సెస్ అయింది అంటే చాలా భయంగా ఉంది. సమాజం ఎటు వెళ్లుతోందో అని. 

ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వెంటనే ఒక మంచి సైక్రియాటిస్టు దగ్గర చూపించుకోవాలి. కుదిరితే అతడి ఫ్యామిలీ కూడా మానసిక వైద్యుడిని కలవాలి. అతనిలో ఏదో ఒక మానసిక రుగ్మత ఉండే ఉంటుంది. ఇలాంటి దిక్కుమాలిన సినిమా చూడడానికి మూడున్నర గంటల సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. 

గుడ్డలు విప్పి బయట తిరగడం.. ఉన్మాదాన్ని కవర్ చేయడం కోసం తండ్రి ప్రేమ అని చూపించడం.. చెల్లి అనిపిలిపించుకున్న అమ్మాయినే లవ్  చేయడం ఇలాంటి దారుణాలు సినిమాలో చాలానే ఉన్నాయి. హీరోయిన్ బ్రా పట్టుకుని లాగడం, కొట్టడం.. మళ్ళీ హీరోని మంచోడిలా చూపించాలి కాబట్టి ఆమెకి వెన్న రాస్తున్నట్లు చూపించడం ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. చంపే సన్నివేశాలు కచ్చిగా, కసిగా చూపించడం లాంటివి ఉంటాయి. శాడిస్ట్ అయినా కూడా హీరోయిన్ అతడితోనే ఎందుకు ఉంటుంది ? హీరో రిచ్ కాబట్టే ఉంటుంది. అంత శాడిస్ట్ పేదవాడు అయితే ఏ అమ్మాయి కూడా భరించదు. హీరోకి డబ్బు ఉంది కాబట్టే భరిస్తుంది ఏమో అంటూ డాక్టర్ రఘురామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: రాజమౌళి, సుకుమార్, వినాయక్, కరుణాకరన్ ఈ డైరెక్టర్ల ఫస్ట్ హీరోయిన్లు వీళ్ళే.. కొందరు కనుమరుగు, మరికొందరు

ఇలాంటి సినిమాలకు సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చి వదిలేయడం కాదు.. బ్యాన్ చేయాలి అని కామెంట్స్ చేశారు. ఇలాంటి చిత్రాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సినిమాలు సమాజంలోకి రావడం ప్రమాదకరం. కొంతమంది ఈ డాక్టర్ వాదనతో ఏకీభవిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు.. దర్శకుడు ఆల్రెడీ సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ లో చూపించారు. అయినా ఎందుకు చూశారు. సినిమాలు ప్రభావితం చేస్తే మహర్షి సినిమాలో లాగా అందరూ సీఈవో లు కావాలి కదా.. సినిమాని సినిమాగానే చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios