సెలబ్రెటీ ప్రపంచంలో కొందరు ప్రవర్తించే తీరు అందరిని షాక్ కి గురి చేస్తాయి. రీసెంట్ గా ఒక యువ నటుడు ప్రవర్తించిన తీరు మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. మధ్య సేవించి వాహనం నడపడమే కాకుండా యాక్సిడెంట్ చేశాడు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించేసరికి ఒక్కసారిగా సీన్ సీరియస్ గా మారింది. 

పరారే యువరాజ్యం - ఫేస్ బుక్ - రాక్షసులు సినిమాల్లో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం తెగ హల్చల్ చేశాడు. అతనితో పాటు ఢిల్లీకి చెందిన అతని ఫ్రెండ్ అను గుప్తా యువతి కూడా ఉంది. ఇద్దరు మద్యం సేవించి ఉన్నారు. బంజారాహిల్స్ లో శుక్రవారం అర్ధరాత్రి మధ్య సేవించి కిరణ్ అనే వ్యక్తి కారును ఉదయ్ డీ కొట్టాడు. 

గొడవ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో అక్కడ ఉదయ్ అతనితో ఉన్న అనుగుప్తా పోలీసులపై దాడికి దిగారు. కంప్యూటర్స్ ను ధ్వంసం చేసి పలు రికార్డులను అను చింపేసింది. డ్రంకెన్ టెస్ట్ లో ఉదయ్ కిరణ్ కు 137 - అనుగుప్తాకు 122 మిల్లీగ్రాముల అల్కహాల్ శాతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఉదయ్ పై పలు కేసుల్లో జైల్లో శిక్షను అనుభవించి వచ్చాడు.