వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చి తనలోని నటుడుని ఆవిష్కరించారు. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా...ఫ్లాప్ అయ్యిందా...యావరేజ్ అయ్యిందా అనేది కలెక్షన్స్ బట్టి చూడాల్సిన అంశం.
వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయుకుడు ప్లాఫ్ అవటంతో యాత్ర సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఎక్కువైంది. సినిమా బాగుంది అనేది సత్యం. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కదిలించాయి. అయితే ఇలాంటి సినిమాలు ఒక వర్గానికి పరిమితం అవుతాయి. రిపీట్ ఆడియన్స్ ఉండరు. దాంతో ఎంత లాగినా బ్లాక్ బస్టర్ హిట్టు కానే కాదు.
తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించటం కలిసొచ్చింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ కు వచ్చేసరికి ప్రపంచ వ్యాప్యంగా 8.81 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఏరియాల వారిగా బ్రేకప్ వివరాలు చూద్దాం.
ఏరియా షేర్ (కోట్లలో )
నైజాం 1.55
సీడెడ్ 1.61
నెల్లూరు 0.41
కృష్ణా 0.61
గుంటూరు 1.12
వైజాగ్ 0.57
ఈస్ట్ గోదావరి 0.32
వెస్ట్ గోదావరి 0.42
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్............ రూ.6.61 కోట్లు
కేరళ 0.70
అమెరికా 0.95
మిగతా ప్రాంతాలు 0.55
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్..... రూ.8.81 కోట్లు
మరో ప్రక్క సినిమాకు టాక్ బాగుండటం వల్ల డిజిటల్ ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలకటం కలిసొచ్చింది. అవన్ని కలుపుకుంటే సినిమా హిట్ క్రిందే లెక్క.
