ప్రభాస్ బ్యానర్‌లో ‘జగన్’బయోపిక్?నిజమే??
వైఎస్ జగన్ జీవితం ఆధారంగా యాత్ర -2 తెరకెక్కించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మహి. వి రాఘవ్ అనౌన్స్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరో రెండు, మూడు నెలల్లోనే సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు.

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గా పేరొందిన యువి క్రియేషన్స్ బ్యానర్ లో యాత్ర దర్శకుడు మహి వి రాఘవ సినిమా ఒకటి చేస్తున్నారనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది.దాదాపు ఈ సినిమా స్క్రిప్టు కూడా ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా అంటే తప్పకుండా సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.మహి వి రాఘవ యువి క్రియేషన్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది కానీ కథ మాత్రం యాత్ర 2 అని కొత్త ప్రచారం మొదలైంది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయ విశేషాలకు సంభందించిన సినిమా. అయితే యాత్ర2 ఉంటుంది కానీ ఇదే యువి బ్యానర్ లో యాత్ర 2 వస్తున్నట్లుగా మాత్రం అఫీషియల్ సమాచారం ఏమి లేదు. మీడియా లో వస్తున్న వార్తలు మాత్రమే ప్రస్తుతానికి ఆధారం.
ఇక వైఎస్ జగన్ జీవితం ఆధారంగా యాత్ర -2 తెరకెక్కించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మహి. వి రాఘవ్ అనౌన్స్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరో రెండు, మూడు నెలల్లోనే సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే హీరో ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మహి. వి రాఘవ్ పేర్కొన్నాడు.
ఎలాంటి పరిస్దితుల్లో జగన్ ...రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఉన్న పరిస్దితులు ఏమిటి.. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, ఓదార్పు యాత్ర, 2019లో ముఖ్యమంత్రి అవడం వంటి కీలక ఘట్టాలుంటాయి. జనం నమ్మకాన్ని ఆయన ఎలా చూరుగుని ముఖ్యమంత్రి అయ్యారు..క్లైమాక్స్ లో ఆయన చేసిన పధకాలు వంటివాటితో ఉండబోతోంది. పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎదురైన అడ్డంకులు, సీబీఐ, ఈడీ కేసులతో ఇబ్బందులు పెట్టడం, జైలు జీవితం అన్నీ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పాదయాత్రను ఎక్కువగా హైలైట్ చేయవచ్చు. వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న పరిస్థితులపై సినిమాలో ఎక్కవగా ఫోకస్ ఉంటుంది. 2024 ఎన్నికల నాటికి సినిమా విడుదల కావచ్చని అంచనా.
మంచి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అన్ని విషయాలు త్వరలో బయటకు వెళ్లడిస్తారని తెలుస్తుంది.ఈ సినిమాతో పాటుగా యువి క్రియేషన్స్ మరో రెండు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాయంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ నటించిన సాహొ, రాధే శ్యాం సినిమాలు తెరకెక్కాయి.అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.అయితే రీసెంట్ ప్రభాస్ తనకు ఆదిపురుష్ నుంచి వచ్చిన సొమ్ముతో ఆ అప్పులు తీర్చేసి ఒడ్డు పడేసారు. ఇక యాత్ర 2 మాత్రం ఇదే బ్యానర్ లో వస్తే మాత్రం అది పెద్ద విశేషమే.