`యాత్ర 2` ఫస్ట్ లుక్.. వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టి, జగన్‌గా జీవా.. రిలీజ్ ఎప్పుడంటే?
వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టిని కంటిన్యూ చేస్తూ, వైఎస్ జగన్‌గా తమిళ నటుడు జీవా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వారి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వీ రాఘవ్ `యాత్ర` పేరుతో సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలై ఆదరణ పొందింది. ఇందులో వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించి మెప్పించారు. వైఎస్‌ఆర్‌ని మైమరపించారు. తాజాగా ఇప్పుడు దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్స్ వచ్చాయి. గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ వారి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది టీమ్.
ఇందులో వైఎస్‌ఆర్‌గా మమ్ముట్టిని కంటిన్యూ చేస్తూ, వైఎస్ జగన్‌గా తమిళ నటుడు జీవా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వారి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. `యాత్ర` సినిమాలో వైఎస్‌ఆర్ చేసిన పాదయాత్ర ప్రధానంగా రూపొందించారు. ఒక ఎమోషనల్ జర్నీగా దాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు `యాత్రం2`లో ప్రస్తుతం సీఎం జగన్ చేసిన పాదయాత్రని చూపించబోతున్నారని తెలుస్తుంది. వైఎస్‌ఆర్ చనిపోయిన పరిస్థితులు, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అనంతరం వైఎస్ చనిపోవడంతో ఆయన అభిమానుల గుండెలు ఆగిపోవడం వంటివి చూపించనున్నారట.
అలాగే చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన `ఓదార్పు యాత్ర` నేపథ్యంలో ఈ సీక్వెల్ ఉండబోతుందట. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే, మమ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్ పోస్టర్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది.
ఈ సందర్భంగా టీమ్ చెబుతూ, ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్రజాదరణను పొందిన ఈ చిత్రంకు కొనసాగింపుగా, వైఎస్.ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.` అని తెలిపింది.
ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా `యాత్ర 2`ని తెరకెక్కిస్తున్నారు.