ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. రీసెంట్ గా విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసే పోరాటాన్ని చూపించారు. 


సమంత తాజా చిత్రం 'యశోద'(Yashoda) ఈ శుక్రవారం రిలీజైంది. సరోగసీ నేపథ్యంలో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. హరి & హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. రీసెంట్ గా విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసే పోరాటాన్ని చూపించారు. దీంతో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా మల్టిఫ్లెక్స్ ల నుంచి మంచి కలెక్షన్సే వస్తున్నాయి. 

అలాగే ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది.ఫస్ట్ వీకెండ్ యుఎస్, ఆస్ట్రేలియా తో కలిపి నాలుగు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని వినికిడి. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కు ఈ సినిమా ప్రాఫిటబుల్ వెంచరే. అసలు ఈ స్దాయి అక్కడ వర్కవుట్ అవుతుందని ఊహించలేదని, ఇది ఆ సినిమా స్దాయికి మైండ్ బ్లాక్ అయ్యే ఫిగరే అని ట్రేడ్ అంటోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి తొమ్మిది కోట్లకు కొన్నారని ఫస్ట్ వీక్ లో సేఫ్ అవుతారని అంటున్నారు.

మరో ప్రక్క కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. 'కార్తికేయ2' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి రూ.22 కోట్లకు అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కుల కోసం కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు నిర్మాత. సినిమా మేకింగ్ అండ్ రెమ్యునరేషన్స్ కలుపుకొని రూ.28 కోట్ల వరకు అయిందట. పబ్లిసిటీ, వడ్డీల కోసం మరో రూ.10 కోట్లు ఖర్చవుతుంది. అంటే మొత్తం రూ.40 కోట్లన్నమాట. సమంతపై ధైర్యం చేసి అంత పెట్టినా తేలిగ్గానే బయిటపడుతున్నట్లు లెక్క.